Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2017 10:29:43
facebook Twitter Googleplus
Photo

ఎలాగైనా హిట్ చేసుకోవాలనే కాక మీద ఉన్నాడు కృష్ణవంశీ. అందుకే ఈసారి ''నక్షత్రం'' సినిమాలో ఏకంగా ముగ్గురు భామలను దించాడు. ఆల్రెడీ రెజీనాతో విపరీతమైన అందాలను దారబోయించి.. అది చాలదన్నట్లు గెస్ట్ రోల్ చేసిన ప్రగ్యా జైస్వాల్ తో కూడా హాటు హాటుగా రెండు పాటల్లో బికినీలు కూడా వేయించారు వంశీ వారు. అది చాలదన్నట్లు శ్రీయతో ఒక ఐటెం సాంగ్ కూడా చేయించారు. అయితే కేవలం గ్లామర్ ఉన్నంతమాత్రాన సినిమాలు ఆడేయవుగా.

ఇప్పుడు ఈ గ్లామర్ టాక్ అంతా దేనికంటే.. మామూలుగా తన సినిమాలో ఒక్క పాటలోనైనా మాంచి రొమాంటిక్ టచ్ ఇస్తాడు కృష్ణవంశీ. ఎక్స్ పోజింగ్ లిమిట్స్ ఎలా ఉన్నా కూడా.. అవి హద్దు దాటకుండా ఉంటూ.. భలే ఎట్రాక్టివ్ గా ఉంటాయ్. అలాగే హీరోహీరోయిన్ కూడా ఘాడమైన రొమాన్స్ పండిస్తూనే చూపరులను ఊరిస్తారు. కాని నక్షత్రం పాటల్లో మాత్రం.. ఏంటో ఘాడమైన రొమాన్స్ చేయకుండా కాస్త ఇబ్బందిగా గేలం వేయడానికి రొమాన్స్ చేసినట్లుంది. అదేనండీ.. ప్రేక్షకులకు గేలం వేయడానికే ఈ రొమాన్స్ ఫోర్సుగా పెట్టినట్లు ఉంది.

ఏదో సరదాగా నక్షత్రం పాటలు ఎలా ఉన్నాయో అంటూ జూక్ బాక్స్ వింటున్న కొందరికి.. ఒక జలక్ తగిలింది. అక్కడ సాయిధరమ్ తేజ్ తన హీరోయిన్ ప్రగ్యా బ్యాక్ పై చేతులు వేసి.. అమ్ అహా కమ్ కహా అన్న చందాన ఏదో చేయడం కనిపించింది. ఇదేంటి వంశీ వారు ఇలా శృతిమించారు అంటూ వెంటనే డిస్కషన్లు మొదలెట్టేశారు.

,  ,  ,  ,