Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Feb-2017 10:22:52
facebook Twitter Googleplus
Photo

యాంగ్రీ యంగ్ మ్యాన్ అని అభిమానులతో పిలిపించుకున్న హీరో రాజశేఖర్ కు.. కొన్నేళ్లుగా సరైన చిత్రం రాలేదు. మళ్లీ ఇన్నేళ్లకి రాజశేఖర్ ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తూ.. ఓ చిత్రం తెరకెక్కుతుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కనుండగా.. ఇప్పుడీ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు.

పీ ఎస్ వీ గరుడవేగ.. 126.18ఎం ఇదీ రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్. బాగా లెంగ్తీగా ఉండడమే కాదు.. చాలా డిఫరెంట్ గా ఉంది టైటిల్. అదే సమయంలో పవర్ ఫుల్ గా కూడా అనిపిస్తోంది. కొత్త హెయిర్ స్టైల్ తో ఉన్న రాజశేఖర్.. సైడ్ యాంగిల్ లో యంగ్ గా కనిపిస్తున్నాడు. యాంగ్రీ పోలీస్ రోల్ కావడంతో.. స్టైలింగ్ విషయంలో కూడా చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ టైటిల్ కి అర్ధం ఏమిటా అనే విషయం అంతు బట్టడం లేదు. అయితే.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో వెనకాల కనిపిస్తున్న బెరెట్టాస్.. 300 వించెస్టర్ వంటి పదాలు అన్నీ తుపాకుల పేర్లే.

అలాగే ఈ టైటిల్ 'పీఎస్వీ గరుడవేగ 126.18ఎం' అనేది కూడా ఓ గన్ కి సంబంధించిన పేరు అయుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 4న రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ లాంఛ్ చేసింది మూవీ యూనిట్. ఇండియాలో మెజారిటీ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. జార్జియాలో కూడా ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. జార్జియాలోని టిబిలిసి... బటుమి.. బొర్జోమీ వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరపగా.. త్వరలో మూవీ ఆడియో ఫంక్షన్.. రిలీజ్ కి సంబంధించిన మరిన్ని డీటైల్స్ వెల్లడించనున్నట్లు నిర్మాణ సంస్థ జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ చెబుతోంది.

,  ,  ,  ,  ,  ,