Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2017 13:37:50
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాలలో హాట్ అందాలను బాగా ప్రచారం చేసి విఫలం అయన సినిమా ఏది అంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు నక్షత్రం. కృష్ణ వంశీ సినిమాలు అంటే ప్రేక్షకులులో ఒక క్రేజ్ ఉంది. ఇండస్ట్రి వాళ్ళు కూడా కృష్ణ వంశీని మంచిగా గౌరవిస్తారు. చాలాకాలం నుండి ఒక్క హిట్ కూడా లేని కృష్ణ వంశీ ఈ సినిమాతో హిట్ కొట్టి తన మునిపటి స్థాయి కి వెళ్ళతాడు అనుకున్నారు అంతా. కానీ అందరి అంచనాలు తారు మారు చేసింది నక్షత్రం సినిమా. బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్లు ఎలాగూ రాలేదు కనీసం ఈ సినిమాకు ప్రేక్షక ఆదరణ కూడా దక్కలేదు అని ట్రేడ్ టాక్. ఈ ఏడాది వచ్చిన సినిమాలలో నక్షత్రం ఘోర పరాజయం చెందిన సినిమాగా పేర్కొనవచ్చు.

ఈ సినిమాలో హీరోగా నటించిన సందీప్ కిషన్ నక్షత్రం సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. కథ బాగుంది పైగా కృష్ణ వంశీ డైరెక్టర్ గా చేస్తున్నాడు అంటే ఎవరైనా అలానే ఆశలు పెట్టుకుంటారు లెండి. సుందీప్ కూడా ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం అదే అయి ఉండవచ్చు. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ కావడంతో సుదీప్ తీవ్ర నిరాశ చెందాడు అంటా. సినిమా విజయం ఎలా ఉన్న కనీసం తన నటనకు అయన గుర్తింపు వస్తుంది అనుకున్నాడు కానీ ఆ ఆశలు కూడ ఫలించలేదు. సినిమాను చూసిన చాలామంది ప్రేక్షకులు కూడా ఏమి అంటున్నారు అంటే “ సినిమా కథ బాగా నే ఉంది కానీ ఏదో పాట సినిమా స్టైల్ లో తీసినట్లు ఉంది.” అని చెబుతున్నారు.

సందీప్ ఇప్పుడిప్పుడే ఒక మంచి హీరోగా నటుడుగా గుర్తింపు పొందుతున్నాడు. కొత్త కథలు ఎంచుకొని ఒక మామూలు హీరోలా కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంటున్న టైమ్ లో ఇప్పుడు ఈ నక్షత్రం వచ్చి తన ఇమేజ్ ని పెంచడం అటు ఉంచి మరింత కిందకు దించిందే అని భాద పడిపోతున్నాడు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి నటుడు పరిస్థితి ఇలానే ఉందిని స్పెషల్ గా చెప్పవలిసిన పనిలేదు అనుకోండి

,  ,  ,  ,  ,