Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2016 10:44:59
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు.. కొరటాల శివ కాంబినేషన్ లో మూవీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. నిజానికి శ్రీమంతుడు సక్సెస్ వెంటనే.. మరోసారి ఈ కాంబో ఖాయమనే వార్తలు వచ్చాయి. తాజాగా అవి ఫైనల్ స్టేజ్ కి కూడా వచ్చాయి. కానీ.. మహేష్ తో కొరటాల చేయనున్న మూవీపై ఇప్పుడో రూమర్ చక్కర్లు కొడుతోంది. అది మహేష్ భార్య నమ్రత చుట్టూ తిరుగుతుండడం విశేషం.

కొరటాల శివ తన సినిమాలకు తనే స్టోరీ ఇస్తుంటాడు. కానీ జనతా గ్యారేజ్ విషయంలో మాత్రం కొరటాల లైన్ అండ్ లెంగ్త్ గాడి తప్పిందనే టాక్ ఉంది. సినిమా హిట్ అయినా.. శ్రీమంతుడు టైప్ లో మెప్పించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే.. కొరటాల చెప్పిన స్టోరీ లైన్ ను.. నమ్రతా శిరోద్కర్ వేరే రైటర్లతో డెవలప్ చేయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే థీమ్ మాత్రం కొరటాలది కాగా.. స్టోరీ.. స్క్రీన్ ప్లే వేరేవాళ్లు ఇస్తారన్న మాట.

ఇందులో వాస్తవం ఎంతో ఇంకా తెలీలేదు కానీ.. మహేష్ బాబు చేసే సినిమా స్టోరీల్లోకి కూడా నమ్రత ఎంటర్ అయిపోయిందనే టాక్.. కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తుంటే.. ఫ్యాన్స్ మాత్రం ఈమె జడ్జిమెంటల్ స్కిల్స్ విషయంలో ఫుల్లు హ్యాపీగా ఉన్నారులే.

,  ,  ,  ,  ,