Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2017 15:18:10
facebook Twitter Googleplus
Photo

పరిశ్రమ ఖ్యాతి పెరుగుతోంది. టాలీవుడ్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి మన కళాకారులు చాలా కష్టపడుతున్నారు. ఇతర ఇండస్ట్రీలకు మించి తెలుగు చిత్ర పరిశ్రమ నిలిచింది అంటే ప్రతి కళా కారుడి కష్టమనే చెప్పాలి. అయితే అటువంటి వారు ఎప్పుడైనా మంచి గుర్తింపు అందుకుంటారు. ప్రతి ఏడాది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నందులను పురస్కారాలు ఉత్తమ కళాకారులను వరించాయి.

అయితే ఎవరెవరికి అవార్డులు దక్కయో అందరికి తెలిసిందే. కానీ ఇందులో ఒక విశేషం ఉంది. అదేంటంటే.. ఎక్కువగా పశ్చిమ జిల్లాకు చెందిన వారికే అవార్డులు దక్కాయి. బాహుబలి సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ది బెస్ట్ గా ఫిల్మ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. అయితే 2015 సంవత్సరానికి గాను జక్కన్న ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఇక వారి సోదరుడు ఎమ్ ఎమ్.కీరవాణి ఏకంగా రెండు అవార్డులను దక్కించుకున్నారు. 2015 ఉత్తమ సంగీత దర్శకుడిగా అలాగే ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యారు. వీరిద్దరూ కొవ్వూరు ప్రాంత వసూలు. అలాగే 2014 ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ గా చందూ మొండేటి కి ఇచ్చారు అతను కూడా కొవ్వూరు నుంచి వచ్చిన వాడే .

ఇక అదే స్థాయిలో మొగల్తూరు ప్రాంత వాసులు మెగాస్టార్ చిరంజీవి - కృష్ణంరాజులు కూడా పలు పురస్కారాలను అనుకున్నారు. నంది అవార్డులను అందుకోవడం వీరికి కొత్తేమి కాదు. వారి కెరీర్ అనేక విభాగాల్లో పురస్కారాలను అందుకున్నారు. మిర్చి సినిమాకు ప్రభాస్ కూడా నంది అవార్డుని సొంతం చేసుకున్నాడు. 2015 సంవత్సరనికి గాను బాహుబలికి ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది ఆ సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా మొగల్తూరు వాసేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గుంటూరు జిల్లా వాసి బ్రహ్మానందం ఈ సారి కూడా నంది అవార్డుని దక్కించుకున్నాడు.

అయితే ఆయన అధ్యాపకునిగా పని చేసింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోనే. 2014 రేస్ గుర్రం సినిమాకు గాను బ్రహ్మానందం బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక పాలకొల్లుకు చెందిన మరో ఇద్దరు సినీ ప్రముఖులు కూడా నంది అవార్డులను అందుకున్నవారే. పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ 2011 సంవత్సరంలో స్వీయ రచనలోని సినిమా పోస్టర్ పుస్తకానికి నంది అవార్డు దక్కింది. ఇక 2014 సంవత్సరంలో ఉత్తమ కథా చిత్రంగా టామీ నిలిచింది.

,  ,  ,  ,  ,