Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jun-2015 11:18:33
facebook Twitter Googleplus
Photo

యూత్ హృదయాలను దోచుకునే యువకథానాయకుల జాబితాలో నాగశౌర్య కూడా కనిపిస్తూ వుంటాడు. ప్రేమకథా చిత్రాల ద్వారా యూత్ ను ఆకట్టుకుంటూ వచ్చిన నాగశౌర్య, నందినీరెడ్డి దర్శకత్వంలో మరో ప్రేమకథలో నటిస్తున్నాడు. 'అలా మొదలైంది' తరువాత ఆ స్థాయి ఫీల్ ని ఆవిష్కరిస్తూ నందినీరెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది.

నాయకా నాయికల మధ్య చోటుచేసుకునే పాటలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను .. ఫస్ట్ లుక్ ను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. కామెడీ టచ్ తో కూడిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్ ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది చూడాలి.

,  ,