Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2016 10:31:06
facebook Twitter Googleplus
Photo

రాజమౌళి ఓ సినిమా గురించి ట్వీట్ వేస్తే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో.. మిగతా ఎవరి కంటే కూడా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు బాగా చెప్పగలడు. హృదయకాలేయం పోస్టర్ పై రాజమౌళి చేసిన ఒకే ఒక ట్వీట్ ఎఫెక్ట్ తో.. హీరోగా హిట్ కొట్టేశాడు సంపూ. జక్కన్న ట్వీట్ పవర్ పై ఓపెన్ గానే ఓ వంద సార్లయినా పొగిడేసి ఉంటాడు సంపూర్ణేష్. ఆ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఇప్పుడో మూవీపై రాజమౌళి వేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. ఓ మూవీపై హైప్ క్రియేట్ అయ్యేందుకు కారణమవుతోంది.

'ఒక సినిమాకి ఫస్ట్ లుక్ తో విపరీతమైన ఆసక్తి కలిగించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఇది తప్పనిసరి. షోటైమ్ చేసిందదే.' అంటూ ఓ ఫోటోని పోస్ట్ చేసిన జక్కన్న ట్వీట్ కూడా పెట్టాడు. ఓ సినిమా థియేటర్.. దూరంగా ప్రొజెక్షన్ రూమ్ నుంచి లైటింగ్ పడుతుంటే.. అందులో నీడల్లా కనిపిస్తున్న అబ్బాయి - అమ్మాయి. థియేటర్లో ఫ్రంట్ లైన్ లో కుర్చీపై రక్తపు మరకలు.. చెబుతుంటేనే కాదు.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూస్తున్నా అంతే ఆసక్తి కలుగుతుంది. షోటైమ్ మూవీకి సంబంధించిన పోస్టర్ ఇది.

రాజమౌళికి వరుసకు కజిన్ అయ్యే ఎస్.ఎస్.కాంచీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. అమృతం వంటి సూపర్ హిట్ సీరియల్ తో ఇతను జనాలకు బాగానే తెలుసు. రమా రీల్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ మూవీ టీజర్ లాంఛింగ్ ఫంక్షన్ కు.. రాజమౌళి - కీరవాణి - రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలు హాజరు కావడంతో.. టాలీవుడ్ లో షో టైమ్ పై ఆసక్తి నెలకొంది.

,  ,  ,  ,  ,  ,  ,