Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Dec-2017 11:00:42
facebook Twitter Googleplus
Photo

లేడీ డైరెక్టర్ల సంఖ్య చాలా తక్కువ. ఉన్న ఆ కొద్దిమందిలోనూ కమర్షియల్ హిట్లు సాధించడమే తక్కువ. అలాంటిది ఫస్ట్ సినిమాతో అద్భుతమైన హిట్ సాధించింది డైరెక్టర్ నందినీ రెడ్డి. కానీ మొదటి సినిమాలో కనిపించిన డైరెక్టరల్ మ్యాజిక్ తరవాత సినిమాల్లో కనిపించలేదు. జబర్దస్త్... కళ్యాణ వైభోగమే సినిమాలు చేసినా అవి ఆమె కెరీర్ కు ఏమంత ప్లస్సవ్వలేదు.

ఎలాగైనా తిరిగి తన కెరీర్ ను హిట్ బాట పట్టించే లక్ష్యంతో యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి డైరెక్టర్ నందినీ రెడ్డి అయింది. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ దశే మారిపోయింది. నందినిరెడ్డితో సినిమా చేయడానికి అతడు రెడీ అయినప్పటికీ ఆమె చెప్పిన సబ్జెక్టుకు మాత్రం నో చెప్పేశాడట. దీంతో కొత్త స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో పడిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ నందినిరెడ్డికి అవకాశం ఇవ్వడానికి కారణం ఆమెకు బడా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కుమార్తె స్వప్నాదత్ సపోర్ట్ లభించడమే. విజయ్ దేవరకొండ మొదటిసారి వెండితెరకు పరిచయమైంది స్వప్నాదత్ ప్రొడక్షన్ లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే. అందుకే స్వప్నాదత్ మాటతోనే నందినీరెడ్డితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనేది లేటెస్ట్ టాక్.

అలా మొదలైంది సినిమా తరవాత నందినీరెడ్డికి బోలెడు ఛాన్సులొచ్చాయి. కానీ తరవాత వచ్చిన జబర్ దస్త్ సినిమా మొత్తం అవకాశాలకే గండికొట్టింది. మొత్తానికి తిప్పలుపడి క్రేజ్ ఉన్న హీరోలతో డేట్లు సంపాదించుకుంది. కానీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

,  ,  ,  ,  ,