Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-May-2016 12:12:58
facebook Twitter Googleplus
Photo

నందిని రెడ్డి. అలా మైదలైంది సినిమా హిట్టవ్వగానే ఎక్కడలేని క్రేజ్ ను ఈ లేడీ డైరక్టర్ సొంతం చేసుకుంది. కాకపోతే ఆ తరువాత ఆ క్రేజ్ ను నిలబెట్టుకోవడంలో చాలా ఇబ్బందులే పడింది. అనుకున్నంత ఈజీగా ఆమె స్టార్డమ్ కు చేరుకోలేకపోయింది. రెండో సినిమా జబర్ దస్త్ గాట్టిగానే కొట్టింది. తరువాత చాలా గ్యాపిచ్చి కళ్యాణ్ వైభోగమే చేసినా కూడా.. ఆ సినిమాను అందరూ బాగుందీ అన్నా కూడా.. కమర్షియల్ గా వర్కవుటయినట్లు ట్రేడ్ వర్గాల నుండి ఎలాంటి సమాచారమూ లేదు.

కట్ చేస్తే.. ఈ లేడీ డైరక్టర్ నితిన్ తో సినిమా చేయాలని చూస్తోంది. అయితే ఈ స్టోరీ చాలా కొత్తదని.. నెవర్ బిఫోర్ బై ఎనీ తెలుగు హీరో అని.. అసలు తెలుగు తెరపై ఇది రాని ఎమోషన్ అని.. ఈవిడ ఫీలర్లు పంపిస్తోందట. కాని గతంలో ఈమె తీసిన సినిమాల స్టోరీల్లో ఎన్నో ఇన్సిపిరేషన్ ఉండటంతో.. అంత కొత్తగా అసలు నందిని రెడ్డి ఏం రాసిందబ్బా అంటూ అందరూ కంగారుపడుతున్నారు.

సాధారణంగా తమ కథను ఓకె చేయించుకోవడానికి చాలామంది ఆ విధంగా చెబుతుంటారు. మరి నందిని నిజంగానే చెబుతోందా లేకపోతే కథలో మ్యాటర్ ఉందా అనే విషయం.. ఒకవేళ ఆమెకు నితిన్ ఒక ఆఫర్ఇస్తేనే తెలిసేది. లెటజ్ సీ.

,  ,  ,  ,  ,