Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Sep-2016 15:30:29
facebook Twitter Googleplus
Photo

సాధారణంగా ఈ రేంజు స్టేట్మెంట్ ఇవ్వాలంటే మాత్రం చాలా గట్స్ ఉండాల్సిందే. అయితే యంగ్ హీరో నాని మాత్రం అస్సలు ఏ మాత్రం తడుంకోకుండా ఇలాంటి కామెంట్లు చేసేస్తుంటాడు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడానికి పెద్దగా సిగ్గేంటి అంటున్నాడు ఈ న్యాచురల్ స్టార్. ఇంతకీ అసలు నాని వెర్షన్ ఏంటో చూద్దాం పదండి.

''ఏదైనా జోక్ నా వలన బాగా పేలింది అనడం సరికాదు. ఒక జోక్ ను బాగా రాస్తే.. దానిని ఇంకాస్త ఎలివేట్ చేయడానికి నా పెర్ఫామెన్స్ ఉపయోగపడుతుంది. అంతేకాని నా వలనే ఆ జోక్ పేలినట్లు కాదు. గతంలో నా ఫ్లాపు సినిమాలన్నింటిలోనూ నా పెర్ఫామెన్స్ చాలా బాగానే ఉంటుంది. కాని నా యాక్టింగ్ అనేది సినిమాకు ప్లస్ కాలేదు. అదే బేసిక్ కంటెంట్ బాగుంటే.. నా చివరి నాలుగు సినిమాలు ఆడినట్లు ఆడతాయి. సో.. కంటెంట్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను. కంటెంటే గొప్ప.. హీరో కాదు'' అంటూ సెలవిచ్చాడు నాని. ఈ మధ్యకాలంలో వరుసగా భలే భలే మగాడివోయ్.. కృష్ణగాడి వీర ప్రేమగాధ.. జెంటిల్మన్.. ఇప్పుడు మజ్ను.. ఈ సినిమాలన్నీ కూడా కంటెంట్ కారణంగానే ఆడాయని అంటున్నాడు నాని.

సక్సెస్ మీట్లో మాట్లాడిన నాని ఈ విధంగా తన భావాలను వ్యక్తం చేశాడు. ''మజ్నూ సినిమా మనలోని మేథావికి మాత్రం కాదు. మనలోని చిన్నపిల్లాడికి. ఈ సినిమాను ఒక వండర్ లా చూస్తూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు''. సినిమా చూడగానే నాని కుటుంబ సభ్యులు.. అలాగే రాజమౌళి కూడా నానిని సినిమా బాగుందంటూ ఎప్రిషియేట్ చేశాడటలే.

,  ,  ,  ,  ,  ,