Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 12:07:16
facebook Twitter Googleplus
Photo

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కి ముందు సినిమా గురించి కనీసం నోరు మెదపని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వరుసగా మీడియాకి తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. తన గురించి - తన వీక్నెస్ ల గురించి పవన్ ఓపెన్ గానే చెప్పేస్తుండడం విశేషం.

ముఖ్యంగా తను చేసే డ్యాన్సులను తనే కామెంట్ చేసుకుంటూ విమర్శిస్తూ పవన్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 'నేను గొప్ప డ్యాన్సర్ ని కాదని నాకు తెలుసు. చిరంజీవి - రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల మాదిరిగా నేను డ్యాన్సులు చేయలేను నాకు కంఫర్ట్ గా ఉండే 7-8 స్టెప్స్ ఉంటాయి. నా దర్శకులు - డ్యాన్స్ మాస్టర్లకు వాటికి మించి నేను చేయలేనని ముందే చెప్పేస్తాను' అన్నాడు పవన్ కళ్యాణ్.

కెమేరా ముందు చాలా సిగ్గు పడుతూ ఉంటానని ఇహ డ్యాన్సులు చేయాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటున్న పవన్.. తన పాటల్లో వెనక ఉండే వారిని ఫారిన్ వాళ్లను పెట్టడంలో సీక్రెట్ చెప్పాడు. తనకు డ్యాన్స్ రాదనే విషయం వాళ్లకు అంతగా తెలీదు కాబట్టి.. ప్రశాంతంగా వచ్చిన స్టెప్స్ వేసేస్తాడట. అదీ పవన్ సీక్రెట్..

,  ,  ,  ,  ,  ,