Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2016 11:40:12
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో నుంచి నేచురల్ స్టార్ అయిపోయిన నాని.. ఇప్పుడు ఫుల్ జోష్ చూపిస్తున్నాడు. ఆన్ స్క్రీన్ పై జోరు చూపించే నానికి.. తగిన కేరక్టర్ పడితే మాత్రం మరింతగా రెచ్చిపోతాడు. తనకు అష్టాచమ్మాతో ఇంట్రడ్యూస్ చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణతో.. జంటిల్మన్ చిత్రాన్ని చేస్తున్నాడు నాని. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తయిపోయిన ఈ మూవీకి.. ప్రస్తుతం టీజర్ లాంఛ్ చేశారు.

జంటిల్మన్ టీజర్ ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకుంటుంది. హీరో హీరోయిన్ల కేరక్టర్ల వరకూ ఇంట్రడ్యూస్ చేశారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని.. హీరోయిన్ ని ఆమె ఫ్రెండ్ అడిగిన వెంటనే.. నానిని మాస్ యాక్షన్ హీరో రేంజ్ లో చూపించిన విధానం నాని స్టైల్ అదరహో అనాల్సిందే. తను ఏం చేసినా ఎంత సహజంగా ఉంటుందో.. ఈ టీజర్ లో ఫైట్స్ చూస్తే అర్ధమవుతుంది. ఇక పాటలకు సంబంధించిన విజువల్స్ కూడా చూడముచ్చటగా ఉన్నాయి.

అన్నిటికంటే ముఖ్యంగా గమనించాల్సి ఏంటంటే.. ఇంత యాక్షన్ పార్ట్ చూపించి విలన్ ని పరిచయం చేయకపోవడం. దానికి కూడా డైరెక్టర్ దగ్గర ఓ రీజన్ ఉంది. ఈ మూవీలో హీరో.. విలన్.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రను నాని చేస్తున్నాడనే విషయం ఇప్పటికే చెప్పేస్తున్నారు. అసలు జంటిల్మన్ లో నాని చేస్తున్న రోల్ హీరోనా విలనా అనే పజిల్ ని మాత్రం ఇంకా కంటిన్యూ చేశారు. మొత్తం మీద టీజర్ ప్రామిసింగ్ గానే కాదు.. అదరహో అనిపించేలా ఉంది. ఈ నేచురల్ స్టార్ అకౌంట్ లో మరో హిట్ పడ్డం ఖాయంగానే కనిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,