Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jan-2017 11:29:19
facebook Twitter Googleplus
Photo

గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ చూస్తే ఇది ?బాహుబలి?కి దీటైన సినిమాలా కనిపించింది. ఐతే ?బాహుబలిని రాజమౌళి ఏళ్లకు ఏళ్లు తీశాడని.. కానీ క్రిష్ ఏడెనిమిది నెలల్లో శాతకర్ణిని అవగొట్టేశాడని చెబుతూ రాజమౌళి గొప్పదనాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కొందరు. ఐతే ఇప్పుడు క్రిష్.. రాజమౌళి గురించి చెప్పిన మాటలు వింటే.. ఆయన్ని విమర్శించిన వాళ్లకు నోళ్లకు తాళం వేసుకోక తప్పదు. తాను ?గౌతమీపుత్ర శాతకర్ణి? సినిమాను అంత వేగంగా.. అంత తక్కువ బడ్జెట్లో తీయగలిగానంటే అందుకు రాజమౌళి ఇచ్చిన సలహాలు కూడా ముఖ్య కారణమని తేల్చి చెప్పాడు క్రిష్.

రాజమౌళికి తాను ?గౌతమీపుత్ర శాతకర్ణి? పూర్తి కథ వినిపించానని.. అది వినగానే ఇది వాస్తవంగా జరిగిన కథ కాబట్టి గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్టుల మీద ఎక్కువ దృష్టిపెట్టవద్దని.. సహజంగా సన్నివేశాలు తీయమని రాజమౌళి గొప్ప సలహాలు ఇచ్చాడని క్రిష్ వెల్లడించాడు. దీని వల్ల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ త్వరగా పూర్తవుతుందని రాజమౌళి చెప్పాడన్నాడు. రాజమౌళి చెప్పినట్లే చేయడం వల్ల వేగంగా.. తక్కువ బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేయగలిగినట్లు క్రిష్ చెప్పాడు.

?బాహుబలి? ఫాంటసీ మూవీ కాబట్టి చాలా కాలం తీయాల్సి వచ్చిందని.. ఐతే ?గౌతమీపుత్ర శాతకర్ణి? వాస్తవ చారిత్రక గాథ కాబట్టి త్వరగా తీయగలిగానని క్రిష్ అన్నాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగిపోతుండటంపై క్రిష్ చక్కటి మాట చెప్పాడు. ??ఈ విషయాలు చాలా నిరాశ పరుస్తున్నాయి. తామేంటో.. తాము జీవితంలో ఏం సాధించామో చూసుకోకుండా పక్కవారిని టార్గెట్ చేస్తున్నారు. అది ఎంతమాత్రం మంచిది కాదు?? అని క్రిష్ అన్నాడు.

,  ,  ,  ,  ,