Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2016 11:01:46
facebook Twitter Googleplus
Photo

అష్టాచెమ్మా.. గోల్కొండ హైస్కూల్.. ఉయ్యాల జంపాల లాంటి సినిమాలతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నాడు రామ్మోహన్. ఆయన దర్శకుడిగా కూడా మారి తను నేను అనే ఒక డిఫరెంట్ మూవీ సినిమా కూడా చేశాడు. ఆ సినిమా నిరాశ పరిచాక మళ్లీ నిర్మాత రోల్ లోకి మారిపోయి పిట్టగోడ అనే సినిమాతో వస్తున్నాడు రామ్మోహన్. ఎప్పట్లాగే అగ్ర నిర్మాత సురేష్ బాబు భాగస్వామ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు రామ్మోహన్. కొత్త దర్శకుడు కేవీ అనుదీప్ రూపొందించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ శుక్రవారం రిలీజవుతుంది. నేచురల్ స్టార్ నాని ?పిట్టగోడ? ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తుండటం విశేషం.

విశ్వదేవ్ రాచకొండ అనే కొత్త అబ్బాయి ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఉయ్యాల జంపాలలో హీరోను ప్రేమించే అమ్మాయిగా కనిపించిన పునర్ణవి భూపాలం ఇందులో కథానాయికగా నటిస్తోంది. మిగతా నటీనటులందరూ చాలా వరకు కొత్తవాళ్లే. ప్రాణం.. వాన లాంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చి ఆ తర్వాత కనిపించకుండా పోయిన కమలాకర్.. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాతో టాలీవుడ్లోకి పునరాగమనం చేయనున్నాడు. సైలెంటుగా షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ వరకు వచ్చేసింది పిట్టగోడ టీం. నిర్మాతగా తన రామ్మోహన్ టేస్టేంటో చెప్పడానికి ఇంతకుముందు ఆయన నిర్మించిన సినిమాలే ఉదాహరణ. ?పిట్టగోడ? కూడా ఆ కోవలోకే చేరుతుందేమో చూద్దాం.

,  ,  ,  ,  ,  ,