Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2017 11:31:04
facebook Twitter Googleplus
Photo

స్పైడర్ క్రియేట్ చేసిన డ్యామేజ్ నుండి ఫాస్టుగా బయటకు రావాలని చూస్తున్నాడు మహేష్. ఆల్రెడీ తను ఇటలీ టూర్ వెళ్లినా కూడా.. ఇక్కడ బ్యాకెండ్ లో ఆయన టీమ్ యాక్టివ్ గా పనిచేస్తోంది. అదిగోండి.. ఇప్పుడు మనోళ్ళు స్పైడర్ ఇంకా ధియేటర్లలో ఉండగానే.. దాని గురించి డిస్కషన్లు జరుగుతున్నప్పుడే.. భరత్ అను నేను సినిమా గురించి ప్రచారం మొదలెట్టేవారు.

భరత్ అను నేను అంటూ మరోసారి శ్రీమంతుడు తరువాత మహేష్ బాబు అండ్ కొరటాల శివ చేతులు కలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. అదిగో ఆ లుక్ లో ఎలా ఉంటాడో ఇప్పుడు చెప్పకనే చెప్పేశారు. ఫార్మల్ డ్రస్సులో మహేష్ చూడ్డానికి రొటీన్ గానే ఉన్నాడు కాని.. కాకపోతే చుట్టూ సెక్యూరిటీ వెనకాల సెక్రటరీని చూస్తే మాత్రం.. ఓవరాల్ సెటప్ అంతా ఎక్సయిటింగ్ గా ఉంది. గతంలో రానా దగ్గుబాటి కూడా లీడర్లో ఇదే తరహాలో కనిపించాడని ఓమారు గుర్తురాకుండా ఉండదులే కాని.. చీఫ్ మినిష్టర్ కు అంతకంటే పెద్ద ఆప్షన్లు ఉండవు మరి.

కొరటాల శివ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ డిలే కావడంలేదని ఈ సినిమా యునిట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.

,  ,  ,  ,