Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2017 11:06:50
facebook Twitter Googleplus
Photo

వర్మ సినిమాల్లో విలన్ల లెక్కే వేరుగా ఉంటుంది. అవతారం మామూలుగానే ఉన్నా.. కేవలం చూపులతోనే భయపెట్టేస్తారు ఆ విలన్లు. అలాంటి విలన్లంటే తనకు చాలా ఇష్టమంటున్నాడు నేచురల్ స్టార్ నాని. తాను కూడా ఆ తరహా విలన్ పాత్రలు చేయాలనుకుంటున్నట్లు నాని చెప్పాడు. ఎవరైనా అవకాశమిస్తే ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించాడతను. ??జెంటిల్ మన్ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాను. జనాలు బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఐతే హీరోలు నెగెటివ్ క్యారెక్టర్లు చేస్తే సినిమా చివరికి వచ్చేసరికి మంచి వాళ్లుగా మారిపోతుంటారు. అలా కాకుండా ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలే చేయాలనుకుంటున్నా. వర్మ సినిమాల్లో విలన్లంటే నాకిష్టం. వాళ్లు చూపులతోనే భయపెట్టేస్తారు. నేను కూడా అలాంటి పాత్రల్ని పండించగలనని నా నమ్మకం?? అని నాని చెప్పాడు.

మరోవైపు తన సినిమాలతో కొత్త కొత్త హీరోయిన్లు పరిచయమై.. మంచి పేరు సంపాదింస్తుండటంపై నాని స్పందిస్తూ.. ??అది నా అదృష్టం. నాకు బాగా కలిసొచ్చే అంశం. నేను తక్కువ వ్యవధిలో సినిమాలు పూర్తి చేస్తున్నా. ఒకదాని వెంట ఒకటి సినిమా చేసేస్తున్నా. అలాంటపుడు స్టార్ హీరోయిన్లను పెట్టుకుంటే కష్టం. డేట్లు సర్దుబాటు చేయలేక ఇబ్బంది పడాలి. అదే కొత్త హీరోయిన్లయితే సమస్య ఉండదు. పైగా వాళ్లకు అవకాశమిచ్చినట్లుంది. వాళ్లకు మంచి పేరొస్తే మనకూ క్రెడిట్ దక్కుతుంది. అయినా కొత్త వాళ్లా.. పేరున్న వాళ్లా అన్నది నేను చూడను. అలా చూస్తే ఇంద్రగంటి గారు నాకు అవకాశం ఇచ్చేవాళ్లే కాదు.. నేనీ స్థాయిలో ఉండేవాణ్నీ కాదు?? అని నాని అభిప్రాయపడ్డాడు.

,  ,  ,  ,  ,  ,