Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2016 12:10:33
facebook Twitter Googleplus
Photo

రీసెంట్ టైమ్ లో నాని స్పీడ్ కి బ్రేక్ వేయగలిగే వాళ్లు ఎవరూ కనిపించడం లేదు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ ఈ శుక్రవారం కొత్త మూవీ మజ్నుని తెరపైకి తెచ్చేస్తున్నాడు. భలే భలే మగాడివోయ్.. కృష్ణగాడి వీర ప్రేమగాధ.. జెంటిల్మన్ చిత్రా సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. మజ్నుపై అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

ఇంత స్పీడ్ చూపిస్తున్న నానికి బ్రేక్ వేయగలిగే ఆలోచన ఎవరికీ లేదు కానీ.. వరుణ దేవుడు మాత్రం కరుణించేటట్లుగా కనిపించడం లేదు. గత మూడు రోజులుగా భారీ వర్షాల కారణంగా.. చాలా ప్రాంతాలు అతలాకుతలం అయిపోతున్నాయి. ముఖ్యంగా హైద్రాబాద్ లో అయితే.. పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే ఉన్న థియేటర్లలో ఉన్న సినిమాలపై కూడా ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడగా.. రానున్న చిత్రాల ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ బాగానే పడనుంది.

ముఖ్యంగా ఈ వారం రిలీజ్ లలో నాని మజ్నునే బిగ్గెస్ట్ మూవీ. వర్షాలు మరో మూడు రోజులు ఉంటాయనే రిపోర్టుల కారణంగా.. వీకెండ్ వరకూ వానలు పడతాయనే అంచనాలున్నాయి. అదే జరిగితే మాత్రం ఎక్కువగా నష్టపోయేది మజ్నునే. మొదటి వీకెండ్ మిస్ అయితే.. ఆ నష్టాన్ని రికవర్ చేసుకోవడం దాదాపు అసాధ్యమే. అందుకే నాని స్పీడ్ కి ఆయన బ్రేక్ వేసేస్తాడా అనుకుంటున్నారు చాలామంది.

,  ,  ,  ,  ,  ,