Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Apr-2016 17:06:31
facebook Twitter Googleplus
Photo

ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రం తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు లో నిర్మాత దిల్ రాజు మరియు కలయిపులి ఎస్ థాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజ్ డెక్కన్ హోటల్ లో విలేకరుల సమావేశం లో నిర్మాత రాజు, నటి సమాంత మరియు డైరెక్టర్ అట్లి ఈ చిత్రం గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం లో ఈ వారమే ఈ చిత్రం భారీ గా విడుదల అవుతుంది అని దిల్ రాజు తెలిపారు.

" దర్శకుడు అట్లి మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. అయన 'రాజా రాణి' చిత్రం తీసిన తీరు నాకు బాగా నచ్చింది. ఆ మధ్య చెన్నై వెళ్ళినప్పుడు ఈ కథ విని, కొన్ని సీన్స్ చూసాను. ఈ కథను తప్పకుండా తెలుగు వాళ్ళకి చూపించాలి అనుకున్నాను . సాధారణం గా డబ్బింగ్ సినిమా లు నేను తెలుగు లో విడుదల చేయాలంటే అందులో ఏదో స్పెషల్ ఉండాలి. పోలీసోడు చిత్రం అదే కోవ కు చెందిన సినిమా", అని నిర్మాత దిల్ రాజు అన్నారు.

"నేను నటించిన చిత్రం విడుదల అయ్యే ముందు నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది . మొదటి సారి ఈ చిత్రం విషయం లో నాకు టెన్షన్ లేదు . అట్లి ఈ సినిమా ను అంత బాగా తీసారు. ఇది తెలుగు లో కూడా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ", అని నటి సమాంత తెలిపారు.

"రాజా రాణి సినిమా తెలుగు లో బాగా ఆడింది. ఆ తరువాత ఇక్కడ చాలా ఆఫర్ లు వచ్చాయి. కాకపోతే ఒక పెద్ద తమిళ చిత్రం చేసిన తరువాత చేద్దాం అనుకున్నాను. త్వరలో తెలుగు లో ఒక పెద్ద సినిమా డైరెక్ట్ చేసే ఉద్దేశం ఉంది. పోలీసోడు చిత్రం తెలుగు లో మంచి విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. పిల్లల్ని మంచి గా పెంచటం ఎంత అవసరమో చెప్పే కథ ఇది. ఇది ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లర్. విజయ్ ఒక పాత్ర లో ఉన్నాడా లేక డ్యూయల్ రోల్ ఆ అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది ", అని అట్లి అన్నారు.

విజయ్ , సమాంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ వారం ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ గా విడుదల అవుతుంది.

దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను.

,  ,  ,  ,  ,