Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2016 12:20:40
facebook Twitter Googleplus
Photo

ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా మొదలవడం.. అనివార్య కారణాలతో అది ఆగిపోవడం.. ఆ తర్వాత ఇదే కథను అక్కినేని నాగార్జునకు చెప్పడం.. ఆయన అంతగా ఆసక్తి చూపించకపోవడం తెలిసిందే. ఇప్పుడు ఇదే కథను నానికి వినిపించారని.. అతను ఓకే అన్నాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఐతే దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఆ కథ కాదట. నాని కోసం వేణు శ్రీరామ్ వేరే కొత్త కథ తయారు చేశాడట.

రవితేజ కోసం తయారు చేసింది పక్కా మాస్ యాక్షన్ కథ అని.. నానికి ఆ కథ ఎంత మాత్రం సూటవ్వదని.. ప్రస్తుతానికి ఆ కథను పక్కనబెట్టి నాని కోసం వేరే ఫ్యామిలీ స్టోరీని వేణు రెడీ చేశారని తెలిసింది. అయినా రవితేజ ఇమేజ్ వేరు. నాని ఇమేజ్ వేరు. మాస్ రాజాకు అనుకున్న కథను నాగార్జునతో చేయొచ్చేమో కానీ.. నానితో చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ కథ కొత్తదే కావచ్చని భావించవచ్చు. ఐతే ?నేను లోకల్? తర్వాత కొత్త దర్శకుడు శివశంకర్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టేయడానికి నాని సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో వేణు సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ఆలస్యం కావచ్చు. వచ్చే ఏడాది ద్వితీయార్దంలో ఈ చిత్రం ఆరంభమయ్యే అవకాశముంది.

,  ,  ,  ,  ,