Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2016 12:36:37
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో అల్లు అర్జున్ ఉన్నంత జోరులో మరే హీరో లేడనే మాట వాస్తవం. వరుసగా నాలుగు సినిమాలను 50 కోట్ల వసూళ్లను దాటించిన స్టార్ హీరో.. మరొకరు కనిపించరు. తన స్పీడ్ ను కంటిన్యూ చేస్తూ.. రీసెంట్ గా సరైనోడుతో ఇండస్ట్రీ హిట్ సాధించిన అల్లు అర్జున్.. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'డీజే-దువ్వాడ జగన్నాధం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

సాధారణంగా ప్రతీ సినిమాలోనూ కొత్త లుక్ ని చూపించడం బన్నీకి అలవాటు. ఇప్పుడు డీజేలో కూడా ఇదే రిపీట్ చేయనున్నాడు. కానీ హరీష్ శంకర్ తమ అభిమాన హీరోను ఎలా చూపించనున్నాడనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఎక్కువగానే ఉంది. అయితే.. ఇప్పుడప్పుడే బన్నీ లుక్ ని రివీల్ చేసే ఉద్దేశ్యం మాత్రం ఈ దర్శకుడికి లేదు. దాదాపుగా ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పేశాడు. 'అందరూ డీజే లో అల్లు అర్జున్ ఫోటో చూపించమని అడుగుతున్నారు. కానీ ఇది చాలా స్పెషల్ కాబట్టి.. ప్రత్యేకమైన సందర్భం చూసుకునే ఇస్తాం' అని చెప్పాడు దర్శకుడు. అయితే.. 'ఆలస్యం అవుతున్నందుకు అసలు క్షమించద్దు' అని చెప్పడం మాత్రం హరీష్ శంకర్ స్టైల్ ని చాటుతోంది.

రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి.. అప్పుడే ఫస్ట్ లుక్ ఎక్స్ పెక్ట్ చేయడం కష్టమే. కానీ న్యూ ఇయర్ సందర్భంగా కానీ.. మెగా 150 రిలీజ్ తో కలిపి కానీ.. డీజేకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇవ్వబోతున్నారన్నది ఇన్ సైడ్ టాక్.

,  ,  ,  ,  ,