Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2017 11:55:56
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగార్జున సినిమాల ఎంపిక ఎవరినైనా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. టిపికల్ సబ్జెక్టులను ఎంచుకోవడమే కాదు.. అందుకు తగిన దర్శకులను సెలెక్ట్ చేసుకోవడంలో ఆయన ట్యాలెంట్ తెలిసిపోతుంది. ఈ విషయంలో కొన్నేళ్లుగా ఆయన ట్యాలెంట్ మరీ ఎక్కువైపోతోంది. మనం.. ఊపిరి.. సోగ్గాడే చిన్నినాయన వంటి మూవీస్ నాగ్ ట్యాలెంట్ ను బయపెడతాయి.

ముఖ్యంగా ఊపిరి లాంటి సినిమా చేయడం.. కార్తీతో కలిసి మల్టీ స్టారర్ లో నటించడం.. కాళ్లుచేతులు కదలని వ్యక్తిగా నాగ్ నటన.. ఎన్నో ప్లస్ పాయింట్స్ ఆ సినిమాకి ఉంటాయి. ఇప్పుడు నాగార్జున మరోసారి మల్టీ స్టారర్ కి సై అన్నారని తెలుస్తోంది. నేచురల్ స్టార్ అంటూ ఆడియన్స్ ముద్దుగా పిలుచుకుంటున్న నానితో కలిసి నాగ్ నటిచంనున్నారట. గతంలోనే నిఖిల్ తో కలిసి నాగ్ మల్టీ స్టారర్ అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు నాగార్జున- నాని మల్టీస్టారర్ మాత్రం ఖాయమని తెలుస్తోంది.

ఓ బడా నిర్మాత వీరిద్దరి కాంబోను ఫైనల్ చేశారట. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తోంది

,  ,  ,  ,  ,