తన స్థాయి హీరోల్లో ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో నేను లోకల్ తో వసూళ్ల వర్షమే కురిపించాడు నాని. సినిమా సినిమాకూ తన స్థాయి పెంచుకుంటూ వచ్చిన నాని.. నేను లోకల్ తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టు కొట్టాడు. కలెక్షన్ల పరంగా కొత్త శిఖరాల్ని అందుకున్నాడు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఫుల్ రన్లో రూ.34 కోట్లకు పైగా షేర్.. రూ.58 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. అమెరికాలో మిలియన్ డాలర్ మార్కును దాటిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. కర్ణాటకలో సైతం రూ.2 కోట్లకు పైగా షేర్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.
ఫుల్ రన్లో ఏరియాల వారీగా ‘నేను లోకల్’ వరల్డ్ వైడ్ షేర్స్ వివరాలు..
నైజాం-రూ.10.7 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.4 కోట్లు
సీడెడ్ (రాయలసీమ)-రూ.3.9 కోట్లు
తూర్పు గోదావరి-రూ.2.5 కోట్లు
పశ్చిమగోదావరి-రూ.1.55 కోట్లు
గుంటూరు-రూ.82.25 కోట్లు
కృష్ణా- రూ.50 కోట్లు
నెల్లూరు-రూ.90 లక్షలు
కర్ణాటక-రూ.2.15 కోట్లు
యుఎస్- రూ.3.25 కోట్లు
మిగతా ఏరియాల్లో- రూ.కోటి
ఏపీ-తెలంగాణ షేర్- రూ.27.8 కోట్లు
ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ.42.7 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.34.2 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్-58 కోట్లు