Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2016 12:30:43
facebook Twitter Googleplus
Photo

ఎవడే సుబ్రమణ్యం నుంచి మొదలుకొని ఈమధ్యే విడుదలైన మజ్ను వరకూ ఏడాదిన్నరలో వరుసగా ఐదు విజయాలను సొంతం చేసుకొని దూసుకుపోతోన్న నాని నటిస్తోన్న కొత్త సినిమా నేను లోకల్ క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ నెలాఖర్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రేపు మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయనున్నట్లు నేను లోకల్ టీమ్ తెలిపింది.
ఈ దీపావళికి తెలుగులో స్ట్రైట్ సినిమాలేవీ లేకున్నా ఫస్ట్‌లుక్స్ మాత్రం వరుసపెట్టి రానుండడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న నేను లోకల్ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా దిల్‌రాజు సినిమాను నిర్మిస్తున్నారు.

,  ,  ,  ,  ,