Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2016 11:06:55
facebook Twitter Googleplus
Photo

జెంటిల్మెన్ వంటి థిల్లర్ తరువాత మజ్ను లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ని చేసిన నాని ఆ వెంటనే నేను లోకల్ వంటి మాస్ సబ్జెక్టుని ఎంచుకుని సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు నాని. ప్రస్తుతం ఈయన చేస్తున్న నేను లోకల్ చిత్రం డిసెంబర్ రిలీజ్ కు రెడీగా ఉండగానే మరో కొత్త సినిమాకి సైన్ చేశాడు నాని. ఈ సినిమాను ఈ నవంబర్ 23న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ చిత్రం కూడా సరికొత్త జానర్లో ఉంటుందని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారు. నూతన దర్శకుడు శివ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో నాని సరసన నివేదా థామస్ హీరోయిన్ గా నటించనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ?జెంటిల్మెన్? ఘన విజయం సాధించి, వీరిద్దరి జోడీ సినిమాకే హైలెట్ గా సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ డిసెంబర్ చివర్లో గాని, జనవరి ఆరంభంలో గాని మొదలయ్యే అవకాశముంది.

,  ,  ,  ,  ,  ,  ,