Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2017 14:23:08
facebook Twitter Googleplus
Photo

రెండేళ్లు వెనక్కి వెళ్తే నాని సినిమాలు ఐదారు కోట్లు వసూలు చేయడమే ఎక్కువ అన్నట్లుండేది. 2015లో అతడిని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన ఎవడే సుబ్రమణ్యం ఐదు కోట్ల షేర్ కూడా వసూలు చేయలేదు. కానీ భలే భలే మగాడివోయ్ నుంచి నాని దశ తిరిగిపోయింది. సినిమాకు యావరేజ్ టాక్ వస్తే రూ.15-20 కోట్ల మధ్య వసూళ్లు వచ్చి పడుతున్నాయి. హిట్ టాక్ వస్తే రూ.30 కోట్ల షేర్ కొల్లగొట్టేస్తున్నాడు. నాని చివరి సినిమా నాని లోకల్ యావరేజ్ కంటెంట్ తోనే రూ.35 కోట్ల దాకా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. మరి నాని పేరు మీద సినిమాలు అలా ఆడేస్తున్నపుడు పారితోషకం కూడా బాగానే పుచ్చుకోవడంలో.. తన గత సినిమా వసూళ్లను బట్టి తర్వాతి సినిమాకు రెమ్యూనరేషన్ పెంచడంలో తప్పేమీ లేదు కదా. నాని అదే చేస్తున్నాడిప్పుడు.

నేను లోకల్ సినిమాకు పారితోషకం పెంచి రూ.3 కోట్లు తీసుకున్న నాని.. తన లేటెస్ట్ మూవీ నిన్ను కోరి కి రెమ్యూనరేషన్ ఇంకో కోటి పెంచాడట. మొత్తంగా నాని రేటు రూ.4 కోట్లుగా ఫిక్సయింది. ఈ సినిమాను రూ.15 కోట్లలో పూర్తి చేసినట్లు సమాచారం. బిజినెస్ దాదాపు రూ.20 కోట్ల దాకా జరిగింది. ఇంకా శాటిలైట్ అవ్వలేదు. మొత్తంగా నిర్మాతలు డీవీవీ దానయ్య.. కోన వెంకట్ లకు బాగానే వర్కవుటైనట్లు తెలుస్తోంది. ఐతే క్లాస్ లవ్ స్టోరీలా కనిపిస్తున్న నిన్ను కోరి.. నేను లోకల్.. భలే భలే మగాడివోయ్ తరహాలో వసూళ్ల వర్షం కురిపించే అవకాశాలైతే లేవు.

,  ,  ,  ,