Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Sep-2016 11:48:12
facebook Twitter Googleplus
Photo

సోషల్ సైట్లలో ఫాలోయింగ్ అంటే.. స్టార్ డమ్ కి ఇండికేషన్ కాదు కానీ.. నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఓ గ్రేట్ అఛీవ్ మెంట్ ని సాధించేశాడు. ట్విట్టర్ లో ఇప్పుడు నాని ఫాలోయర్స్ సంఖ్య 10 లక్షలను దాటేసింది. దీంతో తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు నాని.

'నేనిప్పుడు మిలియనీర్ ని. నా ట్విట్టర్ కుటుంబానికి ధ్యాంక్యూ-ప్రేమతో నాని' అంటూ ట్వీట్ చేశాడు నాని. ఈ మిలియన్ క్లబ్ లో ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు.. సిద్ధార్ధలే కాకుండా.. హీరోయిన్స్ సమంత.. త్రిష.. తమన్నాలు ఎప్పుడో జాయిన్ అయిపోయారు. నాని ఇప్పుడీ క్లబ్ లోకి ఎంటర్ అయ్యే సరికి కొంచెం ఎగ్జైట్ అయ్యాడంతే. అయితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంటే నానికే ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉండడం విశేషం. ఇంకా చెప్పాలంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా.. ఈ విషయంలో దాటేశాడు నాని. ముందే చెప్పుకున్నట్లుగా ట్విట్టర్ ఫాలోయింగ్ ని స్టార్ డంని మిక్స్ చేయడం కుదరదు లెండి.

ఎంత యాక్టివ్ గా సోషల్ పేజ్ లలో ఉంటున్నారు.. అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారనే పాయింట్ చుట్టూనే ఈ ఫాలోయర్స్ కథ నడుస్తూ ఉంటుంది. ఈ విషయంలో నాని మహా యాక్టివ్ లెండి. అటు యూఎస్ మార్కెట్లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి.. ఇటు ట్విట్టర్ లో మిలియన్ ఫాలోయర్స్ లో క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నానిని.. డబుల్ మిలియనీర్ అనాల్సిందే.

,  ,  ,  ,  ,