Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Nov-2017 11:19:08
facebook Twitter Googleplus
Photo

మనోజ్ అనగానే అతడి ఎనర్జీ గురించే మాట్లాడతారు అందరూ. అతడి కొత్త సినిమా ఒక్కడు మిగిలాడు ప్రి రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా విచ్చేసిన నారా రోహిత్ కూడా దాని గురించే ప్రస్తావించాడు. కమర్షియల్ సినిమాల్లో మనోజ్ ఎనర్జీ చూడటం మామూలే అని.. కానీ ఒక్కడు మిగిలాడు లాంటి సీరియస్ సినిమాలోనూ మనోజ్ ఎనర్జీ చూస్తుంటే తనకు పిచ్చెక్కిపోతోందని రోహిత్ అన్నాడు. ఈ సినిమాలో కొంత భాగం తాను చూశానని.. మనోజ్ అద్భుతంగా చేశాడని.. ఈ సినిమా టైటిల్స్ పడే సన్నివేశాలు చూసి షాకయ్యానని రోహిత్ తెలిపాడు.

ఒక్కడు మిగిలాడు లాంటి స్క్రిప్టు రాయడం.. ఇలాంటి సినిమా తీయడం మామూలు విషయం కాదని... ఇందుకు దర్శకుడు అభినందనీయుడని అన్నాడు రోహిత్. అలాగే ఇలాంటి సినిమాకు సపోర్ట్ చేసి.. సినిమాకు అవసరమైన మేర ఖర్చు చేసిన నిర్మాతలు కూడా గొప్ప వాళ్లని అతనన్నాడు. ఈ సినిమా విజువల్స్.. బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని రోహిత్ చెప్పాడు. ఒక్కడు మిగిలాడు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా అవ్వాలని.. అవుతుందని తాను భావిస్తున్నట్లు రోహిత్ చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,