Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Sep-2016 10:47:53
facebook Twitter Googleplus
Photo

ఇజం ట్రైలర్ చూస్తుంటే.. ఇది నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో ఓ స్పెషల్ మూవీ అయ్యేలా లక్షణాలు కనిపించాయి. ఇప్పటిదాకా మాస్ మసాలా సినిమాలే చేశాడు కళ్యాణ్ రామ్. యూత్ అప్పీల్ ఉన్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లు చేయలేదు అతను. ?ఇజం? ఆ లోటు తీర్చేలా.. కళ్యాణ్ రామ్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేసేలా కనిపించింది. ఐతే కంటెంట్ ఎంత ఎంగేజింగ్గా ఉందన్నది కూడా కీలకమేలెండి. పూరి లాంటి పెద్ద దర్శకుడితో తొలిసారి పని చేస్తున్న కళ్యాణ్ రామ్.. అందుకు తగ్గట్లే బడ్జెట్ కూడా బాగానే పెంచినట్లున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్లో ?ఓం 3డి? తర్వాత అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ఇదేనట.

ఐతే తన కెరీర్లో చాలా కీలకమైన.. ప్రత్యేకమైన ఈ సినిమాకు అన్ని రకాల ఆకర్షణలు జోడించే క్రమంలో భాగంగా కళ్యాణ్ రామ్.. తన తమ్ముడు ఎన్టీఆర్ తో ఓ క్యామియో రోల్ చేయిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరితో ఎన్టీఆర్ కు మంచి అనుబంధమే ఉంది. ?టెంపర్?తో అతణ్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది పూరీనే. పైగా ఎన్టీఆర్ తర్వాతి సినిమాను కూడా అతనే డైరెక్ట్ చేస్తాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నందమూరి అభిమానులకు కిక్కిచ్చేలా.. అన్నయ్య సినిమాకు హెల్పయ్యేలా చిన్న క్యామియో రోల్ లో తళుక్కుమనబోతున్నాడట తారక్. ?జనతా గ్యారేజ్? విజయోత్సాహంలో ఉన్న అభిమానులకు.. నెల రోజుల్లోపే మళ్లీ ఎన్టీఆర్ ను తెరమీద చూసుకునే అవకాశం లభిస్తే వారి ఆనందానికి అవధులుండవు.

,  ,  ,  ,  ,  ,  ,