Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2016 15:13:37
facebook Twitter Googleplus
Photo

ఓ హిట్ మూవీకి రీమేక్ గా వచ్చిన సినిమా మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. కనీసం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ అయినా మన దగ్గర దాన్ని ఎలా తీశారో చూద్దామన్నా ఆసక్తితో ఉంటారు. నరుడా డోనరుడా విషయంలో ఎవ్వరికి అలాంటి క్యురియాసిటీలు ఉన్నట్టు అనిపించట్లే. యాజ్ యూజువల్ గా సుమంత్ సినిమా వైపు తెలుగు రాష్ట్రాల జనాలు కన్నెత్తి చూడలేదు. ఇక డిఫరెంట్ మూవీస్ ని ఆదరించే ఓవర్ సీస్ అయినా గట్టెక్కిస్తుందనుకుంటే అక్కడి ఆడియెన్స్ కి కూడా డోనరుడు పెద్దగా నచ్చినట్టు లేడు.

హిందీ సూపర్ హిట్ విక్కీ డోనర్ కు రీమేక్ గా వచ్చిన నరుడా డోనరుడా ఫస్ట్ వీకెండ్ ఓవర్ సీస్ వసూళ్లు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయ్. అసలు వాటిని కలెక్షన్స్ అనాలో లేదో గానీ ఈ మూవీకి కేవలం 6 వేల డాలర్లు మాత్రమే వచ్చాయ్. ఓ హై ప్రోఫైల్ రీమేక్ కి ఇంత తక్కువ వసూళ్లు అంటే దారుణం.. అట్టర్ ఫ్లాప్ అనే మాటలు కూడా చాలా చిన్నవే. నిజానికి ముందు అనుకొన్న టైంకి ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోస్ వేసుంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. ఫైనాన్షియల్ ఇష్యూస్ తలెత్తి లాస్ట్ మినిట్ లో షోస్ కేన్సిల్ చేయడంతో సుమంత్ సినిమాకి గాట్టి దెబ్బే పడింది.

పైగా నరుడా డోనరుడా యూనిట్ ముందు నుంచి ప్రమోషన్స్ ని లైట్ తీసుకున్నట్టే కనిపించింది. అదిరిపోయే కాన్సెప్ట్ అందులోనూ హిట్ మూవీ రీమేక్ కాబట్టి అందరూ ఎగబడిపోతారనే భ్రమలో ఉన్నట్టు కనిపించారు టీమ్ మెంబర్స్. కాన్సెప్ట్ ఎంత యూనిక్ అయినా ముందు దాన్ని పబ్లిసిటీ చేసుకోపోతే కష్టమనే విషయాన్నే గుర్తించలేదు. అందులోనూ ఓవర్ సీస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలంటే మాములు విషయం కాదు. రొటీన్ మూవీస్ ని అస్సలు చూడరు. సమ్ థింగ్ డిఫరెంట్ ఉన్న మూవీస్ కి సరిగ్గా పబ్లిసిటీ ఇవ్వకపోతే ఏ మాత్రం పట్టించుకోరు. మరి ప్రొడక్షన్ కి సంబంధించి అన్ని విషయాలు తెల్సిన సుమంత్ తన ఓన్ మూవీకి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడో ఏంటో.

,  ,  ,  ,  ,