Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2017 11:48:43
facebook Twitter Googleplus
Photo

కెరీర్ కీలకమైన స్టేజ్ లో ఉండగా.. బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అది కూడా కొత్త సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో.. ఈ మాట చెప్పడానికి చాలానే గట్స్ ఉండాలి. ఈ శుక్రవారం మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్న మనోజ్.. తను ఇక్కడి నుంచి 6 నెలలు బ్రేక్ తీసుకోబోతున్నానని.. ఏప్రిల్ తర్వాత తన తర్వాతి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తానని చెబుతున్నాడు.

కొన్ని నెలల క్రితం ఒక్కడు మిగిలాడు తన చివరి చిత్రం అంటూ ట్వీట్ చేసి.. మంచు మనోజ్ సెన్సేషన్ సృష్టించాడు. దేశాన్ని ఉద్ధరించలేకపోయినా.. జనాల మధ్యకు వెళ్లి చుట్టూ ఉన్న కొంత ప్రాంతం అయినా బాగు చేయాలని భావించానని అందుకే అలా ట్వీట్ చేశానని చెప్పిన మంచు మనోజ్.. ఆ తర్వాత తన అన్న మంచు విష్ణు వారించిన తర్వాత సినిమాలు కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలిపాడు. కాకపోతే.. ఒక్కడు మిగిలాడు చిత్రంలో ప్రభాకరన్ ను పోలిన పీటర్ పాత్ర కోసం చాలానే బరువు పెరగాల్సి వచ్చింది.

గతంలో తనకు అయిన గాయాలను కప్పిపుచ్చేందుకు.. కండలు పెంచి ఎక్సర్ సైజులు చేసినట్లు చెప్పిన మంచు మనోజ్.. ఈ పీటర్ పాత్ర కోసం మళ్లీ లావుగా మారాల్సి రావడంతో.. గాయాలు అన్నీ తిరగబెట్టాయని.. ఇప్పుడు కనీసం రెండు నెలల పాటు బ్రేక్ తీసుకోకపోతే గాయాలు తీవ్రం అయిపోతాయని అంటున్నాడు.

,  ,  ,  ,  ,