Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jul-2017 15:59:33
facebook Twitter Googleplus
Photo

సినిమాలో డ్రగ్స్ తీసుకొన్నారు అనే ఆరోపణ వచ్చిన వాళ్ళలో నవదీప్ కూడా ఒకడు. డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆరోపణ వచ్చిన తరువాత చాలామంది మాకు డ్రగ్స్ కు ఎటువంటి సంబంధం లేదు. మాకు అసలు పోలీసులు నుండి ఎటువంటి నోటిస్లు రాలేదు అని చెప్పిన వారు ఉన్నారు. కానీ ముందు నాకు వాళ్ళు నోటిస్ ఇచ్చారు నేను విచారణకు వెళ్ళి హాజరు అవుతాను అని ముందు చెప్పిన మనిషి అయితే అది నవదీప్ అనే అనాలి. కానీ నాకు డ్రగ్స్ ఎటువంటి సంబందం లేదు అని మాత్రం గట్టిగా వాదిస్తున్నాడు. డ్రగ్స్ విచారణ ఎలారా బాబు అని మిగతా వారు ఆలోచిస్తుంటే నవదీప్ మాత్రం అది అంతా ముఖ్యమైన విషయమే కాదు అంటున్నాడు.

నవదీప్ ఇప్పుడు సంఘం గురించి సమాజపు పోకడలు పై ఆలోచిస్తునట్లు ఉన్నాడు. ఒక పక్క మిగతావారితో విచారణ జరుగుతుంటే నవదీప్ తన ట్విటర్ లో నదులు గురించి ఆలోచించండి అని చెబుతున్నాడు. కొన్ని చేతులు కలిసి గట్టుగా మార్చి ఆ హద్దులు మధ్య పారే నదిని ఉంచి మన జీవితాలు కోసం మన నదులను కాపాడుకొందాం రండి అని చెబుతున్నాడు. ఇలా పెట్టిన ఇమేజ్ కు ఒక టాగ్ లైన్ కూడా రాశాడు నవదీప్. మనం అసలు అవసరమైన వాటి గురించి కాకుండా అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తున్నాం అంటూ రాశాడు. మేల్కొండి ప్రజలారా మన నదులు కోసం చేతులు కలపండి అని ర్యాలీ ఫర్ రివర్స్ కు సపోర్ట్ చేస్తున్నాడు. డ్రగ్స్ న్యూస్ కాదు.. ఇవి ముఖ్యం అని చెప్పకనే చెబుతున్నాడు.

హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ ఇప్పుడు చెప్పుకోతగ్గ సినిమాలలో ఏమీ నటించడం లేదు. అప్పుడప్పుడూ సెకండ్ హీరోగా నటించడం చేస్తున్నాడు. ఇప్పుడు మాత్రం డ్రగ్స్ రాకెట్ లో ఒకానొక విచారణ ఎదుర్కొంటున్న సెలబ్రిటీగా ఉన్నాడు.

,  ,  ,  ,  ,