Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Apr-2017 12:00:20
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 మూవీలో అన్ని పాటలు బ్లాక్ బస్టర్స్ అయినా.. అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు మాత్రం నిజంగానే కుమ్మేసింది. ఎక్కడైనా.. ఎప్పుడైనా ఎవరితో అయినా డ్యాన్సులు వేయించేసింది ఈ బీట్. అభిమానులనే కాదు.. ఊహ తెలియని పసివాళ్లను కూడా అలరించే అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడంటూ.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను ఆకాశానికి ఎత్తేశారు చిరంజీవి.

విదేశాల్లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సర్ట్ లు ఇవ్వబోతుండగా.. దీని లాంఛింగ్ ఈవెంట్ కు హాజరయ్యారు చిరంజీవి. 'మంచి మ్యూజిక్ అందరూ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. కానీ అప్పుడే పుట్టిన పిల్లలను కూడా ఆ సంగీతానికి మైమరచిపోయేలా చేయడం చిన్న విషయం కాదు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటకు.. మా ఇంట్లో మా కజిన్ వాళ్ల చిన్న పాప ఆ పాట వింటేనే కానీ.. ఆ బీట్ వేస్తేనే.. ఊగుతూ అన్నం తింటుంది. ఈ మధ్యన ఓ వీడియో చూశాను. ఓ చిన్న పాప అమ్మ కోసం ఏడుస్తుంటుంది. మధ్యలో బీట్ వినిపిస్తే.. తను ఏడుస్తూనే అమ్మడు లెట్స్ కుమ్ముడు అంటోంది అంటూ తను కూడా ఆ చిన్నారి ఏడుపును ఇమిటేట్ చేశారు మెగాస్టార్.

,  ,  ,  ,