Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2016 12:23:35
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వెండితెరకు మరో హీరో పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే మహేష్... సుధీర్.. ఇండస్ట్రీలో వున్నారు. ఇప్పుడు విజయ నిర్మల మనుమడు.. సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ కృష్ణ ?నందిని నర్సింగ్ హోం?తో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నాడు. బేసిక్ గా టెక్నీషియన్ అయిన నవీన్... నటన మీద వున్న ఇంట్రెస్ట్ తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నవీన్ మీడియాతో ముచ్చటించాడు.

?ఇంటర్మీడియట్లోనే నేను సినిమాల్లోకి రావాలనుకున్నా. దాంతో త్రీడీ యానిమేషన్ కోర్సు చేసి... ఎడిటింగ్ డిపార్ట్ మెంట్లో పనిచేశారు. ఓ షార్ట్ ఫిలిం నన్ను ఎడిటింగ్ వైపు నడిచేలా చేసింది. చలి అనే ఓ షార్ట్ ఫిలింను తీసి... దర్శకుడు కృష్ణ వంశీకి చూపించా. దాన్ని చూసి ఆయన బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఎడిటింగ్ బాగా చేశావ్ అని మెచ్చుకున్నాడు. దాంతో అప్పటి నుంచి ఆయన డేంజర్ - రాఖీ చిత్రాలకు ఎడిటింగ్ డిపార్ట్ మెంట్లో పనిచేశా. అలా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చా. కుటుంబ సభ్యులు కూడా బాగా ప్రోత్సహించారు. ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ కాబట్టి... రాత్రింబవళ్లు మేల్కోవాల్సి వచ్చేది. టైంకి తిండి కూడా సరిగా తినలేకపోయేవాణ్ని. ఎప్పుడు పడితే అప్పుడు తినడం... పడుకోవడం వల్ల నా బరువు 130 కిలోలకు పోయింది. దాంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. డాక్టర్లు వెంటనే వృత్తినైనా మార్చుకో... లేదా.. టైంకి తిని పడుకో.. లేకుంటే.. నీ ఇష్టం అన్నారు. దాంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. యాక్టింగ్ వైపు దృష్టి సారిద్దాం అనుకున్నా? అన్నారు.

?నా ఒపినీయన్ ఓసారి ఖలేజా షూటింగ్ లో మహేష్ అన్నకు చెప్పా. చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. అయితే మరి ఇంత బరువును ఎలా తగ్గించగలవు... కాన్ఫిడెంట్ వుందా అన్నాడు. నేను సన్నబడుతానని చెప్పా. ఓకే జాగ్రత్త అన్నాడు. ఓసారి ఏదో బుక్ లాంచింగ్ కి ఇంటికొచ్చాడు మహేష్ అన్న. నేను జనాల్లో చివర్లో ఎక్కడో నిలుచున్నా. అప్పటికే దాదాపు 75 కిలోలకు వచ్చేశా. నన్ను చూసి..మహేష్ అన్న ఒక్కసారిగా నువ్వేనా? అన్నాడు. అవును అన్నా. వెంటనే ఆయన షాక్ అయ్యాడు. నా కమిట్ మెంట్ ని చూసి మెచ్చుకున్నాడు. డెడికేషన్.. హార్డ్ వర్క్ ను నమ్ముకుంటే.. తప్పకుండా సక్సెస్ కావచ్చు అని ప్రోత్సహించాడు. దాంతో క్రమం తప్పకుండా వర్కవుట్లు చేసి... మితాహారంతో నా వెయిట్ తగ్గించుకుని.. ఫిట్ అయ్యాడు. ఓకానొక దశలో నేను 68 కిలోలకు వచ్చేశా. అందరూ నన్ను చూసి... ఏరా ఏదైనా ఆరోగ్య సమస్యలా అన్నారు. దాంతో మరో ఏడు కిలోలు పెరిగా. ఇప్పుడు ఇదిగో ఇలా వున్నా? అంటూ.. తన ఫిట్ నెస్ గురించి వివరించాడు.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ ?ఈ చిత్రానికి స్క్రిప్టే ప్రధాన బలం. హిలేరియస్ కామెడీతో ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. సప్తగిరి - షకలక శంకర్ - వెన్నెల కిశోర్ ల కామెడీ ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. తప్పకుండా ఇది నాకు బెటర్ లాంచింగ్ అని నమ్ముతున్నా. అంత బాగా వచ్చింది. దర్శకుడు చాలా బాగా డీల్ చేశాడు మూవీని. తప్పకుండా ఆడియన్స్ ను సాటిస్ ఫై చేయగలమనే నమ్మకం నాకుంది? అంటూ ముగించాడు.

,  ,  ,  ,