Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 12:47:52
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ 150వ సినిమా గురించి రోజూ చాలా రూమర్లే వింటుంటాం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ అనే చర్చ వచ్చినప్పుడు మాత్రం.. వెంటనే మనకు తట్టే పేర్లు కొన్నే. వాటిలో నయనతార - అనుష్క పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటాయి. ఏకంగా 3 కోట్లు ఆఫర్ చేసి మరీ నయనతారను 'కత్తి' రీమేక్ లో హీరోయిన్ గా సైన్ చేశారని ఒక రూమర్. ఇందులో నిజముందా?

''అసలు నన్ను మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసమే అడగలేదు. ఏది పడితే అది రాస్తున్నారు. నేను ఎక్కువ డబ్బు అడిగానని.. నాకు కోట్లలో ఇచ్చారని.. నేను తల ఎగరేస్తున్నానని.. కాని వాటన్నింటిలో నిజం లేదు. అస్సలు నన్ను ప్రొడక్షన్ టీమ్ కాని.. లేదా ఒక మేనేజర్ కాని.. ఈ సినిమా గురించి అడిగితే ఒట్టు. రూమర్లను నమ్మకండి'' అంటూ ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో నయన చెప్పుకొచ్చింది.

షాకింగ్ న్యూస్ అంటే ఇదే కదూ. ఒక ప్రక్కన మెగా ఫ్యాన్స్ అందరూ నయనతారే హీరోయిన్ అని ఫిక్సయిపోయినప్పుడు.. ఇలా ఆమె మాత్రం నన్ను అడగలేదు మొర్రో అనేసిందటే.. షాకింగ్ కాక ఏమవుతుంది. ఇంతకీ చిరు 150వ సినిమాలో హీరోయిన్ గా నటించే ఆ ఛాన్సు ఎవరిని వరిస్తుందో..

,  ,  ,  ,  ,  ,  ,  ,