Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jul-2016 11:49:05
facebook Twitter Googleplus
Photo

హీరోకి ఓ ఇమేజ్ ఏర్పడితే చాలు. అంతకుముందు అతను నటించి విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాల్ని బయటికి తీస్తుంటారు. ఆ హీరో క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు నాగశౌర్య విషయంలోనూ అలాగే జరుగుతోంది. నాగశౌర్య ?నీ జతలేక?అనే సినిమాలో నటించాడు.ఇదెప్పుడు తీశారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఉన్నట్లుండి వెలుగులోకి తెచ్చారు. ఈ సినిమాను లారెన్స్ దాసరి అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. శౌర్య సరసన పారుల్‌, సరయు అనే ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఇప్పుడు సినిమాని ఆగస్టు 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తునారు. మరి ఈ సినిమా ప్రమోషన్స్ లో శౌర్య కనిపిస్తాడా అంటే అనుమానే. ఎందుకంటే ఈ మధ్యే శౌర్య లేకుండానేఈ సినిమా ఆడియో రిలీజ్ చేశారు. సో.. ఈ సినిమా పై శౌర్యకి ఎలాంటి ఇంట్రస్ట్ లేదు. ఆయనకున్న కొద్దిపాటి ఇమేజ్ ను క్యాస్ చేసుకునే ప్రయత్నమే ఇది

,  ,  ,  ,  ,