Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2016 10:38:31
facebook Twitter Googleplus
Photo


స్టార్ రైటర్ నుంచి ప్రొడ్యూసర్ గా టర్న్ అవుతున్న కోన వెంకట్ సోదరి నీరజ. ఈమెకు సౌత్ బ్యూటీ సమంతకు బోలెడంత ఫ్రెండ్ షిప్ ఉంది. అనేక ఈవెంట్స్ లోనే కాదు.. అడపాదడపా కూడా వీరు కలిసి ముచ్చట్లు పెట్టేసుకునేంత ఫ్రెండ్ షిప్ వీరిది.

వృత్తి పరంగా సెలబ్రిటీ స్టైలిస్ట్ కం కాస్ట్యూమ్ డిజైనర్ అయిన నీరజ కోనలో.. మరో యాంగిల్ కూడా ఉంది. ఈమె మంచి ఫోటోగ్రాఫర్ కూడా. తన ట్యాలెంట్ ను చూపేందుకు మోడల్ గా వేరే ఎవరో ఎందుకంటూ.. బెస్ట్ ఫ్రెండ్ సమంతనే ఎంచుకుంది నీరజ కోన. ఈమె తీసిన ఫోటోల్లో దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది సమంత. స్లీవ్ లెస్ ఎల్లో డ్రెస్.. సమంత ఒంటికలర్ కు కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయంది. అటు కాస్ట్యూమ్ డిజైనర్ కావడం.. తనే ఫోటోగ్రఫీ చేయడంతో.. థీమ్ కు తగినట్లుగా సమంతకు కాస్ట్యూమ్స్ ఇచ్చి.. అదిరిపోయే ఫోటోలను నీరజ కోన షేర్ చేసింది.

'ఈ ఫోటోలను నేనే నేనే నేనే తీశా. నా వెరీ ప్రెట్టీ ఫ్రెండ్ సమంత' అంటూ ట్వీట్ చేసిన నీరజ కోనకు.. సమంత రీట్వీట్ కూడా పెట్టింది. 'నీకు ట్యాలెంట్ సూపర్' అంటూ నాలుగు నమస్కారాలు కూడా పెట్టేసింది సమంత.

,  ,  ,  ,  ,