Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2016 10:13:28
facebook Twitter Googleplus
Photo

బాహుబలి తర్వాత వాట్ నెక్ట్స్. ప్రభాస్ మూవీస్ గురించి నిన్న మొన్నటి వరకు ఈ విషయంలో కొంచెం క్లారిటీ మిస్సింగ్. బాలీవుడ్ మూవీ చేస్తాడని.. హాలీవుడ్ స్టోరీస్ వింటున్నాడని చాలానే వినిపించాయ్. అయితే అవన్నీ కాదు రన్ రాజా రన్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో నటించనున్నాడని కన్ఫామైంది. మరి హీరో అంటే విలన్ కామనే కదా. పైగా ప్రభాస్ లాంటి భారీ పర్సనాల్టీని ఫేస్ చేయాలంటే విలన్ కూడా అంతే ఉండాలి. అందుకే ప్రభాస్ కోసం కొత్త విలన్ ని పట్టుకొస్తున్నాడు సుజీత్. బాలీవుడ్ హీరో టర్న్డ్ విలన్ నీల్ నితిన్ ముఖేష్ ని టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.

రన్ రాజా రన్ వచ్చి రెండేళ్లైంది. హిట్ కొట్టిన డైరెక్టర్ గా సుజీత్ కి మంచి డిమాండే ఉంది. కానీ సుజీత్ మాత్రం రెండో మూవీని ప్రభాస్ తోనే తీయాలని అంతే పట్టుదలగా ఉన్నాడు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. నేషనల్ అప్పీరియన్స్ వచ్చేసింది. అందుకే ఇన్నాళ్లూ ఒక లెక్క. ఇక మీదట చేయబోయే మూవీస్ మరో లెక్క. దీన్ని దృష్టిలో ఉంచుకునే కాస్ట్ అండ్ క్రూ విషయంలో కేర్ ఫుల్ గా ఉంటున్నారు. విలన్ నీల్ నితిన్ ముఖేష్ సెలక్షన్ కూడా ఇందులో భాగమే.

ఇక నీల్ నితిన్ విషయానికొస్తే బాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. నీల్ తాత ఫేమస్ సింగర్ ముఖేష్ కుమార్. 2007లో జానీ గద్దార్ తో హీరోగా పరిచయమైన నీల్ మంచి యాక్టరనే పేరు తెచ్చుకున్నాడు కానీ హీరోగా మాత్రం పాపులర్ కాలేకపోయాడు. దీంతో విలన్ గా మారాడు. రెండేళ్ల క్రితం కత్తి మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులే కొట్టేశాడు. ఇప్పుడు ప్రభాస్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. సౌత్ లో విలన్స్ కి ఎప్పుడూ ఫుల్ డిమాండే. సో ఇక్కడ కూడా ఇంప్రెస్ చేస్తే టాలీవుడ్ కి మరో ఛార్మింగ్ విలన్ దొరికినట్టే.

,  ,  ,  ,  ,