Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Feb-2017 14:33:47
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ నేను లోకల్.. అన్ని ఏరియాల్లోనూ ఇరగదీసి ఆడేస్తోన్న సంగతి తెలిసిందే. మొదటివారంలోనే బయ్యర్స్ అందరినీ లాభాల్లోకి తెచ్చేసిన ఈ ప్రాజెక్ట్.. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన భలేభలే మగాడివోయ్ ను దాటేసే అంచనాలు ఉన్నాయంటున్నారు ట్రేడ్ జనాలు.

సింపుల్ స్క్రిప్టులతో డీసెంట్ హిట్స్ కొట్టే నాని సత్తాని.. నేను లోకల్ ప్రూవ్ చేసింది. దీనికి ప్రధాన కారణం గతంలో నాని సినిమాల టైటిల్స్ క్లాస్ టచ్ తో ఉంటే.. నేను లోకల్ మాత్రం మాస్ లుక్ ఇచ్చేసింది. నేను లోకల్ కి బీ సీ సెంటర్స్ లో భారీ వసూళ్లు రావడంలో ఇది కూడా ఒక రీజన్. ప్రస్తుతం శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టేశాడు. ఇప్పుడు టీం అంతా అమెరికాలో తెగ స్పీడ్ గా షూటింగ్ చేసేస్తున్నారు. ఈ మూవీకి 'మాస్ హీరో' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

గతంలో చాలానే టైటిల్స్ అనుకున్నా.. మాస్ హీరో అయితేనే సరిగ్గా సెట్ అవుతుందని భావిస్తున్నారట. పైగా మాస్ టచ్ ఉంటేనే.. నేను లోకల్ ఏ రేంజ్ లో హిట్ అయిందో చూశాక.. ఈ టైటిల్ పై మరింతగా మక్కువ పెరిగిందని తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ గా మాత్రం టైటిల్ ను అనౌన్స చేయకపోయినా.. దాదాపు ఇదే ఫిక్స్ అయ్యారట. నిర్మాత డీవీవీ దానయ్య కూడా మాస్ హీరోకి ఓకే చెప్పేశాడని టాక్.

,  ,  ,  ,