Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2016 13:09:46
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ? కొరటాల శివ కాంబినేషన్ లో హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా రాబోతున్న ?జనతా గ్యారేజ్? విడుదల కు సిద్ధం అయ్యింది. మరో రెండు రోజుల్లో దేవి శ్రీ సమకూర్చిన ఆడియో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యం లో చిత్ర యూనిట్ ఆడియో రిలీజ్ డేట్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపించి అభిమానులను అలరించాడు. కాకపోతే ఆ లుక్ లో ఆంధ్రావాలా చిత్రాన్ని గుర్తుచేసే విధంగా ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వాస్తవంగా జనతా గ్యారేజ్ చిత్రం ముంబాయి బ్యాక్ గ్రాఫ్ లో సాగుతుందనే ప్రచారం జరుగుతుంది. ఆంధ్రావాలా చిత్రం కూడా ముంబాయి బ్యాక్ గ్రాఫ్ లో సాగింది. కాకపోతే ఆ చిత్రం లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించాడు . గ్యారేజ్ లో మాత్రం సింగల్ గా కనిపించబోతున్నాడు. పూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఆంధ్రావాలా సైతం విడుదల కు ముందు భారీ హైప్ ను తీసుకొచ్చింది. ఆడియో కూడా భారీ రేజ్ లో జరగడం తో సినిమా ఫై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలే సినిమాను ప్లాప్ గా చేసాయి.

ఇప్పుడు గ్యారేజ్ ఫై కూడా ఇండస్ట్రీ లోనే కాకుండా అభిమానులలో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉండడం తో ఆ స్థాయి హిట్ కొడుతుందా..లేక ఆంధ్రావాలా లాగానే నిరాశను మిగిలుస్తుందా అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. సెప్టెంబ‌ర్ 2 న గ్యారేజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్ సరసన సమంత , నిత్యా మీనన్ లు నటించగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి మూవీస్ బ్యానర్ ఫై సినిమా విడుదల కాబోతుంది.

,  ,  ,  ,  ,  ,