Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Aug-2015 17:32:19
facebook Twitter Googleplus
Photo

ఇదివరకు ఓ సినిమాకి ఒక టైటిల్ ని వెదకడమే కష్టమైపోయేది. ఇప్పుడు మాత్రం ఒక్కో సినిమాకి రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి. అదో ఇదో మరొకటో ఏది ఫిక్స్ చేయాలో అర్థం కాక దర్శకనిర్మాలు తలలుపట్టుకొంటున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ సినిమాకైతే దాదాపుగా అరడజను పేర్లు వినిపిస్తున్నాయి. అఖిల్ సినిమాకి కూడా లెక్కబెడితే అన్నే పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా ఈ రెండు సినిమాలకి టైటిల్ ఏదీ ఫిక్స్ కాలేదు. మరో వారం రోజుల్లో రెండు సినిమాలకి సంబంధించిన టైటిళ్లు వందశాతం ఖరారయ్యే అవకాశాలున్నాయి. చెర్రీ సినిమా సంగతేంటో కానీ... అక్కినేని చిన్నోడు అఖిల్ సినిమాకి మాత్రం దాదాపుగా ఇదే పేరు ఖాయం అంటున్నారు కొద్దిమంది. ఆ పేరేంటంటే... మిస్టర్ అఖిల్.

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో సయేషా కథానాయిక. నితిన్ సుధాకర్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మొదట్నుంచీ `మిస్సైల్` అనీ అదనీ ఇదనీ చాలా పేర్లు వినిపించారు. కానీ ఏదీ ఫిక్స్ చేయలేదని ఆమధ్య నితిన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవల టీమ్ అంతా కలిసి పేరును ఫిక్స్ చేశారని తెలిసింది. అది ప్రకటించడమే ఆలస్యం అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

సినిమాలో అఖిల్ క్యారెక్టర్ పేరు కూడా అఖిలేనట. అందుకే `మిస్టర్ అఖిల్` అనే పేరునే ఫిక్స్ చేద్దామని భావిస్తున్నారట. ఈ పేరును నాగార్జున ఆమోదించాల్సి వుందని తెలుస్తోంది. సినిమా ఫస్ట్ లుక్ ను నాగార్జున బర్త్ డేను పురస్కరించుకొని ఆగస్ట్ 29న రిలీజ్ చేస్తున్నారు. నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా ఆడియో విడుదల చేస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని అక్టోబర్ 21న విడుదల చేస్తారు.

,  ,