Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Aug-2016 17:18:44
facebook Twitter Googleplus
Photo

?కబాలి? సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ స్టామినా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందన్నది పక్కనబెడితే.. విడుదలకు ముందు హైప్ మామూలుగా లేదు. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. మిగతా భాషల్లో సినిమా కలెక్షన్లు తర్వాత పడిపోయాయి కానీ.. తమిళంలో మాత్రం ?కబాలి? బాగానే ఆడింది. మొత్తానికి ?కబాలి? విషయంలో రజినీ మరీ బాధ పడే పరిస్థితి అయితే కనిపించలేదు. మొదట్లో వచ్చిన డివైడ్ టాక్ చూసి.. రజినీకి మరోసారి కోలీవుడ్ బయ్యర్లతో తలపోటు తప్పదని అనుకున్నారు. కానీ ?కబాలి? ఆ కష్టం తప్పించింది. హమ్మయ్య అనుకుని ఇక తన తర్వాతి సినిమా మీద దృష్టిపెట్టాడు రజినీ.

?కబాలి? విడుదలకు ముందు రజినీ అనారోగ్యంతో దాదాపు రెండు నెలలు అమెరికాలో గడిపి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంటికొచ్చి కూడా విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నారు. ఐతే ఎట్టకేలకు ఆయన మళ్లీ ముఖానికి రంగేసుకోబోతున్నారు. రజినీ కోసం హోల్డ్ లో పెట్టిన ?రోబో-2? షూటింగ్ మళ్లీ మొదలవుతోంది. ఈ నెలాఖరు నుంచి ?2.0? కొత్త షెడ్యూల్ ఆరంభం కాబోతోంది. రజినీ రోబో మేకప్ తో షూటింగులో పాల్గొనబోతున్నారు. రజినీ ఈ సినిమా షూటింగుకి దూరంగా ఉన్న రోజుల్లో వేరే నటులతో తలకోనలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాడు శంకర్. దీంతో పాటు విజువల్ ఎఫెక్టుల పనులూ చూసుకున్నాడు. ఇప్పుడు రజినీ రెడీ అయిపోవడంతో మూడు నెలల పాటు వరుసగా షెడ్యూళ్లు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

,  ,  ,  ,