Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2015 15:51:50
facebook Twitter Googleplus
Photo

అక్కినేని అఖిల్ దీపావళి రోజుకు ఫిక్స్ అయ్యాడు. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేయడంతో.. మిగిలిన మూవీస్ లెక్కలు తేలుతున్నాయి. అఖిల్ తర్వాత రెండు వారాలకు అంటే అక్టోబర్ 27న బెంగాల్ టైగర్ డేట్ సెట్ చేసుకోవడంతో.. మధ్యలో ఓ రోజుని ఫిక్స్ చేసుకున్నాడు నిఖిల్. శంకరాభరణం అక్టోబర్ 20న రిలీజ్ అవుతుందంటూ ట్వీట్ చేశాడు.

అటు అఖిల్ ఇటు రవితేజ.. రెండు భారీ మూవీస్ లో వస్తున్నాడు నిఖిల్. సాధారణంగా అయితే రెండు పెద్ద సినిమాల మధ్యలో లోబడ్జెట్ మూవీ రావడమంటే పెద్ద రిస్కే అవుతుంది. కానీ ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం విజువల్స్ బాలీవుడ్ మూవీని తలపించడం ఇండస్ట్రీటాక్ పాజిటివ్ గా ఉండడం శంకరాభరణానికి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.

కోన వెంకట్ రైటింగ్ దర్శకత్వ పర్యవేక్షణలో వస్తోంది శంకరాభరణం. హిందీ చిత్రం ఫస్ గయారే ఒబామా రైట్స్ తీసుకుని. సెంట్రల్ ప్లాట్ ఆధారంగా సొంతగా స్టోరీ రాసుకుని తెలుగులో చేస్తున్నారు. నిఖిల్ నందితలు జంటగా నటిస్తున్న ఈమూవీలో.. సీతమ్మ అంజలి బందిపోటు కిడ్నాపర్ గా ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

,  ,  ,  ,