Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2017 10:29:38
facebook Twitter Googleplus
Photo

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా పెళ్లీ పెళ్లాం వంటివేమీ లేకపోయినా ఈ తెలుగు హీరో మాత్రం తనకు పుట్టబోయే కూతురి పేరును మాత్రం డిసైడ్ చేసేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం... అవును.. కేశవ సినిమా హీరో నిఖిల్ తనకు పుట్టబోయే పాప పేరేంటో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

నిఖిల్ హీరోగా నటించిన కేశవ సినిమా ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నిఖిల్.. ఇన్నాళ్లూ తన మనసులో దాచుకున్న విషయాన్ని బయటపెట్టాడు.
తన కూతురు పేరు మాయ అని పెడతానని చెప్పారు. పర్సనల్ గా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి.. పెళ్లి గురించి చెప్పండంటూ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా రియాక్ట్ అయ్యాడు.

అయితే... తన పెల్లెప్పుడు... ఎవరిని చేసుకుంటాడు... ఏమైనా లవ్ ఎఫైర్ ఉందా అన్న ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానమేమీ చెప్పలేదు. కానీ పెళ్లి తర్వాత మాత్రం తనకు ఆడ పిల్ల పుట్టాలని కోరుకుంటున్నానని చెప్పాడు. అంతేకాదు పుట్టబోయే బిడ్డకు మాయ అనే పేరు కూడా పెడతానని చెప్పేశాడు.

,  ,  ,  ,