Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2015 12:24:19
facebook Twitter Googleplus
Photo

కొత్తదనానికి ప్రాధాన్యతను ఇస్తూనే అది యూత్ కి కనెక్ట్ అవుతుందో లేదో చూసుకోవడంలో నిఖిల్ ఎంతో శ్రద్ధపెడుతుంటాడు. అందువల్లనే ఆయన వరుస విజయాలను అందుకుంటూ ముందుకి వెళుతున్నాడు. 'సూర్య vs సూర్య' సక్సెస్ తరువాత కాస్తంత విరామం తీసుకున్న నిఖిల్, తన తదుపరి చిత్రం 'శంకరాభరణం' షూటింగుకి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా నందిత కనిపించనుంది. ఉదయ్ నందనవనం తెరకెక్కించనున్న ఈ సినిమాకి రచయిత కోన వెంకట్ స్క్రిప్టును అందించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వుండటం విశేషం.

ఇక కోన వెంకట్ పనితీరుని గురించి నిఖిల్ ప్రస్తావిస్తూ, స్క్రిప్టు విషయంలో ఆయన తీసుకునే శ్రద్ధ తనకి ఆశ్చర్యాన్ని కలిగించిందని చెబుతున్నాడు. ఒకటికి రెండుసార్లు స్క్రిప్ట్ చదువుకుంటూ .. అవసరమైన మార్పులు చేసుకుంటూ పకడ్బందీగా పూర్తిరూపాన్ని తీసుకొచ్చిన తీరును అభినందించకుండా ఉండలేనని అంటున్నాడు. క్రైమ్ కామెడీగా రూపొందనున్న ఈ సినిమాకి ఆయన అందించిన కథ .. స్క్రీన్ ప్లే ప్రాణమనీ, త్వరలోనే ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకి వస్తుందని చెప్పుకొచ్చాడు.

,  ,  ,  ,  ,  ,