Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Nov-2016 10:40:12
facebook Twitter Googleplus
Photo

ఒక చిన్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లుండటమే ఎక్కువ అంటే.. ఈ శుక్రవారం విడుదల కాబోయే నిఖిల్ సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా లో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉన్నారట. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ తో పాటు తమిళమ్మాయి నందిత కథానాయికలన్న సంగతి తెలిసిందే. వీళ్లు కాక ఇంకో ముగ్గురు హీరోయిన్లు ఈ చిత్రంలో కనిపిస్తారట. ఈ సంగతి స్వయంగా నిఖిలే వెల్లడించాడు. ??అవును.. మా సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉంటారు. ఆ హీరోయిన్లు ఎవరు అన్నది రివీల్ చేయలేదు. కథ ప్రకారంగా ఆ పాత్రలన్నీ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్లే?? అని నిఖిల్ అన్నాడు.

ఇక తన పాత్ర గురించి నిఖిల్ చెబుతూ ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు నిఖిల్. ఇందులో అతను ?బాహుబలి? సినిమాకు పని చేసే గ్రాఫిక్ డిజైనర్ పాత్రలో కనిపిస్తాడట. ఆ పాత్ర విషయంలోనూ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని నిఖిల్ అన్నాడు. సినిమా పోస్ట్ మేకింగ్.. ప్రమోషన్ల విషయంలో ఎక్కువ జోక్యం చేసుకుంటాడంటూ ఈ మధ్య తన గురించి వచ్చిన వార్తలపై నిఖిల్ స్పందిస్తూ.. ??ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనలైజ్ చేశాక క్రియేటివ్ సైడ్ నేనస్సలు జోక్యం చేసుకోను. అదంతా దర్శకుడికే వదిలేస్తా. సినిమా ప్రమోషన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం నా ప్లాన్ బయటికి తీసి.. అన్నిరకాలుగా సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని అనుకుంటా. ఈ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గను?? అని నిఖిల్ స్పష్టం చేశాడు.

,  ,  ,  ,