Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2016 11:28:41
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్యే పెద్దగా హడావుడి లేకుండా తమ కొత్త సినిమాను మొదలుపెట్టేశారు నిఖిల్-సుధీర్ వర్మ. డిస్ట్రిబ్యూషన్లోంచి సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతూ ఒకేసారి ఐదు సినిమాలకు శ్రీకారం చుట్టిన అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. టైటిల్ ఏదీ పెట్టకుండానే షూటింగ్ ఆరంభించిన సుధీర్.. ఈ చిత్రం పేరును మధ్యలోనే ప్రకటించేశాడు. నిఖిల్ ను కేశవ గా చూపించబోతున్నాడు సుధీర్ వర్మ. ఈ రోజే ఈ టైటిల్ గురించి అనౌన్స్ మెంట్ వచ్చింది. టైటిల్ విషయంలో మరీ బుర్ర బద్దలుకొట్టేసుకోకుండా సింపుల్ గా హీరో పేరునే టైటిల్ గా కన్ఫమ్ చేసేశాడు సుధీర్.

నిఖిల్-సుధీర్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ?స్వామిరారా? ఎంత పెద్ద సెన్సేషనో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిఖిల్ కెరీర్ గాడినపడి.. అతడి మీద ప్రేక్షకుల్లో ఒక భరోసా కలిగింది ఆ సినిమాతోనే. దీని తర్వాత నాగచైతన్యతో సుధీర్ చేసిన ?దోచేయ్? నిరాశ పరిచింది. ఆ సినిమా తర్వాత ఏడాదిన్నర పైగా విరామం తీసుకుని కేశవ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. తొలి రెండు సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్ కథాంశాలు ఎంచుకున్న సుధీర్ ఈసారి ఎలాంటి స్టోరీ ట్రై చేశాడో చూడాలి. ఈ చిత్రంలో నిఖిల్ సరసన ?పెళ్లిచూపులు? ఫేమ్ రీతూ వర్మ కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,  ,