సినిమాకి ఐటెం పాట ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తోంది. ఏదైనా ఒక సినిమా వస్తుందీ అంటే అందులో ఐటెంసాంగు ఉందా? లేదా? అని ఆసక్తి యూత్ లో బయలుదేరుతోంది. ఒకవేళ ఐటెం సాంగు వుంటే అది చేసేదెవరు? అనే కుతూహలం పెరిగిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కథానాయికలు సైతం ఐటెం పాటలు చేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నిఖిత పేరు కూడా వినిపిస్తోంది.
తెలుగు .. తమిళ .. కన్నడ .. మలయాళ చిత్రాల్లో నిఖిత అప్పుడప్పుడు గ్లామర్ ప్రాధాన్యతగల పాత్రల్లో కనిపిస్తూనే ఉంది. 'పాయుం పులి' అనే ఓ తమిళ సినిమాలో ఆమె విశాల్ తో కలిసి ఐటెంలో సందడి చేసింది. భారీగా వేసిన మార్కెట్ సెట్లో ఈ పాటను చిత్రీకరించారట. సినిమాకి ఈ సాంగు హైలైట్ గా నిలుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.