Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Aug-2015 16:24:52
facebook Twitter Googleplus
Photo

నిక్కీ గల్రానీ... జోష్ ఫేం వాసువర్మ తీస్తున్న కృష్ణాష్ణమిలో సునీల్ సరసన నటిస్తోంది ఈ భామ. టాలీవుడ్ లో ఈ చిన్నదానికి ఇదే ఫస్ట్ మూవీ కానీ... తమిళ్ మళయాళంలో మాత్రం కుమ్మేస్తోంది. గతేడాదే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినా.. ఇఫ్పటికే దాదాపు 10మూవీల్లో నటించేసింది. ఇప్పుడు చేతినిండా చాలా ప్రాజెక్టులుండగా... అందులో మూడు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిలో రంగంగా తెలుగులోనూ సంచలన విజయం సాధించి 'KO' సీక్వెల్ లో బాబీ సీక్వెల్ లోనూ నటిస్తోంది.

ఇది కాకుండా జీవా సరసన మరో చిత్రంలోనూ లీడ్ రోల్ పోషిస్తుండడం విశేషం. టాలీవుడ్ లో ఈ భామని సునీల్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఈ చిన్నది పుట్టి పెరిగిన ప్రాంతం బెంగళూర్. అయితే తన తల్లి సొంతూరు చెన్నై అని పెళ్లి చేసుకున్నాక బెంగళూర్ లో సెటిల్ అయ్యారని చెబుతోంది నిక్కీ గల్రానీ. అంటే అమ్మడి మదర్ టంగ్ తమిళ్ అన్నమాట. ఈ అమ్మడికి తమిళ్ సూపర్ గా వచ్చు. డబ్బింగ్ కూడా తానే చెప్పేసుకుంటోంది.

తమిళ్ ఇండస్ట్రీలోనే దూసుకుపోతుండడంతో... చీటికి మాటికి అంతదూరం నుంచి రావాలంటే కష్టంగా ఉందిట. అందుకే చెన్నైలోని ఓ పోష్ ఏరియాలో ఇల్లు కొనేసి సెటిల్ అయిపోతోంది. తన తల్లి కాలంలో చైన్నై తో రిలేషన్ బ్రేక్ అయినా... మళ్లీ తన కారణంగా తిరిగిరావడంతో ఫుల్ హ్యాపీ అని చెబ్తోంది నిక్కీ గల్రానీ. అన్నట్లు... ప్రభాస్ -పూరీ కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు సెకండ్ హీరోయిన్ సంజన గుర్తుందా.. ఆమె చెల్లెలే ఈ నిక్కీ గల్రానీ.

,  ,