Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2015 11:20:32
facebook Twitter Googleplus
Photo

వెండితెరపై కొన్ని కాంబినేషన్లు చూడాలని ప్రేక్షకులు ముచ్చట పడుతుంటారు. ఆ కాంబినేషన్లో ఓ సినిమా వచ్చే అవకాశం ఉందనే వార్త వాళ్లకి కలిగించే సంతోషం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకులు ఇదే విధమైన సంతోషాన్ని పొందుతున్నారు. అందుకు కారణం హిందీ చిత్రపరిశ్రమని ఏలుతోన్న సల్మాన్ ఖాన్ .. షారూఖ్ ఖాన్ .. అమీర్ ఖాన్ ఒకే చిత్రంలో కలిసి నటించనున్నారనే వార్త షికారు చేస్తుండటమే.

ఈ ముగ్గురు కథానాయకుల ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ దర్శక నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా ఒక సినిమాకి ప్లాన్ చేస్తున్నాడనేది ఆ వార్త సారాంశం. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూటింగును ఆరంభించి, ఏడాది చివరిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఇది అనుకున్నంత తేలికైన విషయం కాదనే అభిప్రాయాలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. మరి సాజిద్ అనుకున్నది సాధించి సంచలనం సృష్టిస్తాడేమో చూడాలి.

,  ,  ,  ,  ,