కుర్ర హీరో నాని తెగ స్పీడ్ గా సినిమాలు చేసేస్తాడనే విషయం తెలిసిందే. ఒక సినిమా రిలీజ్ అయ్యే సరికే.. తర్వాతి చిత్రాన్ని సగం పూర్తి చేసేయడం నేచురల్ స్టార్ కి అలవాటు. కానీ నేను లోకల్ విషయంలో మాత్రం అది పూర్తి చేశాకే.. కొత్త మూవీ స్టార్ట్ చేశాడు. నేను లోకల్ చిత్రం రిలీజ్ టైమ్ లోనే.. నిన్ను కోరి అంటూ కొత్త సినిమా మొదలుపెట్టాడీ హీరో.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. మొదటి షెడ్యూల్ అమెరికాలో మొదలైన సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టెయినర్ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్ర యూనిట్.. ఫిబ్రవరి తొలివారంలో అమెరికాకు వెళ్లారు. అప్పటి నుంచి ఐదు వారాల పాటు కంటిన్యూస్ గా షూట్ చేయగా.. గత రాత్రితో అమెరికా షెడ్యూల్ పూర్తయిపోయిందట. ఈ వారం చివరకు మొత్తం యూనిట్ అంతా ఇండియాలో వాలిపోతున్నారట. నాని.. హీరోయిన్ నివేదా థామస్ లతో పాటు పలువురు ప్రధాన పాత్రధారులతో కీలకమైన పార్ట్ షూటింగ్ పూర్తయిన్టలు తెలుస్తోంది.
నిన్ను కోరి చిత్రానికి గాను.. మిగిలిన భాగం అంతా హైద్రాబాద్ లోనే షూట్ చేయనున్నారని తెలుస్తోంది